దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని ఆందోళన కలిస్తున్న వేళ భారత్ కూడా ముందస్తుగానే అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణాల విషయంలో కఠిన చర్యలు, విధానాలను మొదలుపెట్టింది. ప్రధాని మోదీ శనివారం కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్‌పై ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో క్షుణ్నమైన పర్యవేక్షణ ఉండాలని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒమిక్రాన్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘాతో పాటు విదేశీ ప్రయాణికులకు కరోనా టెస్టులను చేయాలని ప్రధాని సూచించారు.
ఒమిగ్రాన్ భారత్‌కు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల జాబితా తయారు చేసి అక్కడి నుంచి ప్రయాణికులకు టెస్టులు చేయనున్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాంబ్వే, సింగపూర్, ఇజ్రాయెల్ హాంకాంగ్ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
వివిధ రాష్ట్రాలు కూడా..
దేశంలో కొన్ని రాష్ట్రాలు కూడా ప్రయాణికుల విషయంలో కఠిన చర్యలు మొదలు పెట్టాయి. వీటిలో గుజరాత్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ అరైవల్స్ విషయంలో నిఘా పెట్టింది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఎయిర్ పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని గుజరాత్ ప్రభుత్వం నిబంధన విధించింది. అంతేకాక, ఐరోపా దేశాలు, యూకే, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, బంగ్లాదేశ్, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాంబ్బే, హాంకాంక్ నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి చేసింది. ఈ దేశాల నుంచి వచ్చేవారికి ఏడు రోజుల హోం క్వారంటైన్‌ను తప్పనిసరి చేశారు. లక్షణాలుంటే మరో ఎనిమిది రోజులు పొడిగిస్తారు.
కర్ణాటకలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో విదేశీ ప్రయాణికుల స్ర్కీనింగ్ టెస్టులను మరింత కట్టుదిట్టం చేశారు. కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాలను చూపడాన్ని తప్పనిసరి చేశారు. మహారాష్ట్రలో ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేశారు. అంతేకాక, ప్రయాణికులు రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా ధ్రువీకరణ చూపాల్సి ఉంటుంది.
Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు!!
Also Read: Omicron symptoms: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?