భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి 543 రోజుల కనిష్టానికి దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,744 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించగా, అదే సమయంలో మరో 621 మందిని కొవిడ్ మహమ్మారి బలిగొంది. నిన్న ఒక్కరోజులో 9,481 మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు.
దేశంలో మొత్తం కరోనా రికవరీ కేసుల సంఖ్య 339,98,278 కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ లో మొత్తం కరోనా మరణాలు 4,68,554కు చేరుకున్నాయి. మొత్తం కేసులలో కరోనా మరణాల రేటు 1.36 శాతంగా ఉండగా, కొవిడ్19 బాధితుల రికవరీ రేటు 98.34 అయిందని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 1,05,691 యాక్టివ్ కరోనా కేసులుండగా.. ఇది 543 రోజులలో కనిష్టం కావడం విశేషం. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న సమయంలో తాజాగా దక్షిణాఫ్రికా నుంచి ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త వేరియంట్ డేల్టా కంటే ప్రమాదకరమైనదని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
Also Read: Omicron symptoms: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. నిన్న ఒక్కరోజులో 82,86,058 (82 లక్షల 86 వేల 58) కరోనా డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. జనవరిలో టీకాలు ప్రారంభించనప్పటి నుంచి ఇప్పటివరకూ 1,21,94,71,143 (121 కోట్ల 94 లక్షల 71 వేల 143) డోసుల కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. భారత్‌లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,45,72,523 (3.45 కోట్లు)కు చేరగా.. అందులో 3,39,98,278 (3.39 కోట్ల) మంది కోలుకున్నారు.
Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు!!