కరోనా థర్డ్ వేవ్ గురించి మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోకి కరోనా థర్డ్ వేవ్ రాకుండా చూడాలని తాను ప్రతి రోజు ఉదయాన్నే లేచి దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రభురామ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేస్తునట్లు రాజ్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
రాజ్‌గఢ్‌లోని ఓ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ మిషిన్‌ను ప్రారంభించేందుకు ఆయన అతిథిగా వచ్చారు. ఆ కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రి కరోనా కొత్త వేరియంట్‌పై కూడా మాట్లాడారు.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌పై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Mann Ki Baat: నాకు పవర్ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ
Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి