కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు పాల్గొన్నారు. భేటీ అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడారు. ఏపీలో 24 పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని.. దేశ వ్యాప్తంగా అన్ని పంటలకూ మద్దతుధర ఇవ్వాలని కోరామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 


కనీస మద్దతు ధరపై జేపీసీ వేయాలని కోరినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. ఆహార భద్రత చట్టంలో ఏపీకి జరిగిన అన్యాయం సరిదిద్దాలని చెప్పామన్నారు. బీసీల గుర్తింపునకు సామాజిక, ఆర్థిక కుల గణన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్‌, దిశ బిల్లులను ఆమోదించాలని  సమావేశంలో కోరారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలను చెల్లించాలని.. లేదంటే కేంద్రమే భరించాలని అఖిలపక్ష భేటీలో చెప్పినట్టు విజయసాయిరెడ్డి వెల్లడించారు. 


సమావేశం అనంతరం టీడీపీ ఎంపీలు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌ మీడియాతో మాట్లాడారు. అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని అఖిలపక్షంలో చెప్పినట్టు వెల్లడించారు. ఏకీకృత నిబంధన తీసుకురావడంతో దేశమంతా ఒకే ధర అమలయ్యేలా చూడాలని సూచించామన్నారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణ వద్దని కోరామని  చెప్పారు.  కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై అఖిలపక్ష సమావేశంలో చర్చించామని టీడీపీ ఎంపీలు తెలిపారు. 


Also Read: Omicron Scare: కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం సమీక్ష


Also Read: International News: 'ఆవు.. మహిళ.. ఓ భర్త..' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ట్విస్ట్ అదిరింది!


Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ


Also Read: Covid New Variant: 'దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'


Also Read: Mann Ki Baat: నాకు పవర్‌ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ


Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్


Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?


Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?


Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి