అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. డిసెంబర్​ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ప్రభుత్వం ముందుగా అనుకున్నప్పటికీ దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ బయటపడటంతో ఆందోళన నెలకొంది. దీంతో మరోసారి సమీక్ష నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.


అంతర్జాతీయ ప్రయాణికులకు చేయాల్సిన పరీక్షలు, నిఘాకు సంబంధించిన ఎస్​ఓపీని కూడా సమీక్షించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వైరస్​ కట్టడి చర్యలను ఏ విధంగా మెరుగుపరచాలి అనే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 


విమానాశ్రయాలు, ఓడరేవుల్లో టెస్టింగ్​ ప్రోటోకాల్​ను కచ్చితంగా అమలు చేయాలని ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎమ్​హెచ్​ఏ.టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను పెంచాలని స్పష్టం చేసింది.


రాష్ట్రాలకు లేఖ..



  • కరోనా కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఈరోజు లేఖ రాసింది. ఈ వేరియంట్‌ను ఆందోళకర వైరస్‌గా డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే ప్రకటించింది. ఈ వేరియంట్‌ వెలుగుచూసిన దేశాలను ఇప్పటికే 'రిస్క్' కేటగిరిలో పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాలను భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరిస్తోంది.

  • అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్, వారి కదలికిలపై నిఘా, కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం సహా కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ సూచించారు.

  • ఈ వైరస్ వ్యాప్తి అధికమైతే అందుకు తగ్గట్లుగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల కిట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక టెస్టింగ్ సదుపాయాలను రాష్ట్రాలు దగ్గర పెట్టుకోవాలి.

  • హాట్‌స్పాట్‌లను గుర్తించడం తప్పనిసరి. ఎక్కువ కేసులు వచ్చిన క్లస్టర్‌ను గుర్తించి దానిని హాట్‌స్పాట్‌గా ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా టెస్టింగ్ చేయడం, పాజిటివ్ శాంపిళ్లను ఇన్సాకాగ్‌ పరిశోధనశాలకు పంపిచాలి.  ఆ ప్రాంతంలో పాజిటివి రేటు ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

  • ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం కూడా కీలకం. ఆరోగ్య సేవలను అందించడంలో ఏ మాత్రం ఆలస్యం కాకూడదు. 

  • దేశంలోని వేరియంట్లను గుర్తించేందుకు ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలను స్థాపించింది ప్రభుత్వం. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి.

  • కొవిడ్ వేరియంట్లపై తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించాలి. వ్యాక్సినేషన్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. 


Also Read: International News: 'ఆవు.. మహిళ.. ఓ భర్త..' ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ట్విస్ట్ అదిరింది!


Also Read: Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ


Also Read: Covid New Variant: 'దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'


Also Read: Mann Ki Baat: నాకు పవర్‌ కాదు.. ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ


Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్


Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?


Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?


Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి