NEET 2021 కౌన్సెలింగ్ అతి త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎన్టీఏ తెలిపింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇప్పటికే అభ్యర్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ ను అందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం MBBS/BDS కోర్సులలో ప్రవేశాల కోసం కళాశాలల నీట్ ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితాను సిద్ధం చేస్తాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు వారి పరిధిలోకి వచ్చే సీట్లు, కళాశాలలకు సంబంధించిన మెరిట్ జాబితాను సిద్ధం చేస్తున్నాయని.. రాష్ట్రాల వారీగా వచ్చే మెరిట్‌పై సంబంధం లేదని.. డేటాలో మార్పు ఉండదని స్పష్టం చేసింది.
DGHS, రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టరేట్‌లు.. కౌన్సెలింగ్ రౌండ్‌లకు అర్హత సాధించిన వారు సంబంధిత కౌన్సెలింగ్ అధికారులతో ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ వివరాలు, షెడ్యూల్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ వెల్లడించింది.
NTA సెప్టెంబర్ 12న NEET 2021ని నిర్వహించింది. పరీక్ష అనంతరం.. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిర్దేశించిన అర్హత ప్రమాణాల ఆధారంగా.. అభ్యర్థులు వారి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లలో సమర్పించిన సమాచారం ఆధారంగా నవంబర్ 1న ఫలితాలు విడుదలయ్యాయి.
MBBS/BDS కోర్సుల్లో ప్రవేశం కోసం NEET 2021లో సాధించిన అత్యధిక మార్కుల ఆధారంగా ఆల్ ఇండియా మెరిట్ జాబితాను పర్సంటైల్‌లో తయారు చేశారు. మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. 95 శాతం కంటే ఎక్కువ మంది హాజరయ్యారు.
ఈ కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్ www.mcc.nic.in నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు.
విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనడం కంటే ముందు పేర్లు నమోదు చేయాలి. అనంతరం ప్రాధాన్యతా క్రమంలో భాగంగా కళాశాల, కోర్సులు ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత అభ్యర్థుల స్కోర్, కేటగిరీని బట్టి కళాశాలలు కేటాయించడం జరుగుతుంది. ఆ సీట్లతో సంతృప్తి చెందిన విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి, గడువు తేదీలోపు ఫీజు చెల్లించి సీటును కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్ లో మార్పులు.. వివరాల కోసం ఇక్కడ చూడండి