ఇండియన్ ప్రీమియర్ లీగ్ రీటెన్షన్ సమయం ముగుస్తోంది. నవంబర్ 30లోపు ఏ ఫ్రాంచైజీ ఎవరెవరిని తీసుకుంటుందో బీసీసీఐకి జాబితా సమర్పించాలి. ఇందుకోసం నిర్వాహక కమిటీ కొన్ని నిబంధనలు విధించింది. ఇదంతా పూర్తయ్యాక కొత్త ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. ఆ తర్వాత డిసెంబర్లో మెగా వేలం జరగనుంది.
గరిష్ఠంగా ఎందరు?
మెగా వేలం ముందు ఎనిమిది జట్లు నలుగురు ఆటగాళ్లను రీటెయిన్ చేసుకోవచ్చు. అందులో ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీయులు ఉండొచ్చు. ముగ్గురు భారతీయులు ఒక విదేశీయుడిని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఫ్రాంచైజీలు తమ అవసరాలను ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు పేర్లను ఎంపిక చేసుకొనేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకున్నాక మిగిలిన ఆటగాళ్లలో ముగ్గురిని కొత్త ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు. ఇద్దరు భారతీయులు, ఒక విదేశీయుడిని ఎంచుకోవచ్చు.
ఎవరికి ఎంత?
- 4 ఆటగాళ్లు: రూ.16 కోట్లు, రూ.12 కోట్లు, రూ.8 కోట్లు, రూ.6 కోట్లు మొత్తంగా రూ.42కోట్లు వాడుకోవచ్చు.
- 3 ఆటగాళ్లు: రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు మొత్తంగా రూ.33 కోట్లు వాడుకోవచ్చు.
- 2 ఆటగాళ్లు: రూ.14 కోట్లు, రూ.10 కోట్లు మొత్తంగా రూ.22 కోట్లు వాడుకోవచ్చు.
- 1 ఆటగాడు: రూ.14 కోట్లు లేదా భారత్ జట్టుకు ఎంపికవ్వని ఆటగాడైతే రూ.4 కోట్లు వాడుకోవచ్చు.
పర్స్ ఎంత?
ఇక వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగించే పర్స్ విలువను బీసీసీఐ పెంచింది. గతంలో ఫ్రాంచైజీలు రూ.85 కోట్లు వాడుకొనేవి. ఇప్పుడు మరో రూ.5 కోట్లు పెంచింది. మొత్తంగా మెగా వేలంలో రూ.90 కోట్ల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఆటగాళ్లను రీటెయిన్ చేసుకుంటే ఈ విలువ తగ్గిపోతుంది.
- ఎవరినీ తీసుకోకుంటే : రూ.90 కోట్లు
- ఒకరిని తీసుకుంటే : రూ.76 కోట్లు
- ఇద్దరిని తీసుకుంటే : రూ.66 కోట్లు
- ముగ్గురిని తీసుకుంటే : రూ.57 కోట్లు
- నలుగురిని తీసుకుంటే : రూ.48 కోట్లు
Also Read: IND vs NZ Kanpur Test: యాష్ నువ్వే భేష్..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ
Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్
Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?
Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్ ప్లేయర్
Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి