వివిధ కారణాలతో చదువును మధ్యలోనే మానేస్తుంటారు చాలా మంది. తర్వాత చదువు కొనసాగించాలంటే మాత్రం రెగ్యులర్‌గా చదవడం వీలు కాదు. అందుకే అలాంటి వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఓ వరం లాంటిది. పదోతరగతి, ఇంటర్ పాసైన వాళ్లంతా పని చేసుకుంటూనే ఎలాంటి అటంకాల్లేకుండా డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు. చాలా మంది ఇలా చదివి ఉన్నతోద్యోగాలు పొందారు.
ఈ ఆన్‌లైన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ను మరింత సమర్థమంతంగా చేసేందుకు సిద్ధమైంది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు మార్చేస్తోంది. మరింత కఠినతరం చేస్తోంది.
Also Read: ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఈ కాలేజీలో కోర్సుకు క్రిప్టో కరెన్సీలో ఫీజు చెల్లించొచ్చు
ఇప్పటి వరకు పదో తరగతి పాసయి.. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఎవరైనా ఎంట్రన్స్ టెస్టు ద్వారా డిగ్రీ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ నిబంధన తీసేసింది యూజీసీ. ఇకపై డిగ్రీ చేయాలంటే కచ్చితంగా ఇంటర్ పాసయి ఉండాలని చెప్తోంది. ఇది నిజంగా చాలా మందిపై తీవ్ర ప్రభావం చూపనుంది. పదోతరగతి పాసైన చాలా మంది ఇంట్లో ఉన్న పరిస్థితులు కారణంగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఉద్యోగంలో స్థిరత్వం వచ్చాక డిగ్రీ పూర్తి చేస్తున్నారు. తమ ఫీల్డ్‌లోనే ప్రమోషన్లు పొందుతున్నారు. ఇప్పుడు ఈ అవకాశం లేకుండా పోతోంది. ఈ నిబంధన అటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తోపాటు ఆన్‌లైన్ విద్యకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది యూజీసీ
తెలుగు రాష్ట్రాలు సహా చుట్టు పక్కల రాష్ట్రాల వాళ్లకు అంబేద్కర్ యూనివర్శిటీ గొప్ప వరంగా ఉంది. ఏటా ఈ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్టు నిర్వహించి వందల మందిని డిగ్రీ కోర్సులు అందిస్తోంది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు.
Also Read: ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల... రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Also Read: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు
Also Read: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్'పై కేంద్రం పునరాలోచన!
Also Read: ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్
Also Read: ఐఐటీ ఢిల్లీలో న్యూ ఎంటెక్ కోర్సు.. చేస్తే ఉద్యోగావకాశలు ఎక్కువే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి