కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ (CGLE) టైర్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్ఎస్సీ వెబ్‌సైట్ ssc.nic.in నుంచి మెరిట్ జాబితా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. SSC CGL 2020 టైర్-1 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఆన్ లైన్ విధానంలో నిర్వహించారు. సెప్టెంబర్ 2న SSC CGL 2020 టైర్-1 పరీక్ష కీ విడుదల చేశారు.
Also Read: ఈ కోర్సులు నేర్చుకునే వారు భవిష్యత్ లో దూసుకుపోవచ్చు.. ఉద్యోగం మీకే ముందు వచ్చే ఛాన్స్
కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ప్రకటన
సీజీఎల్ఈ టైర్-I పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా, అభ్యర్థులు టైర్-II, టైర్-III పరీక్షలకు హాజరయ్యేందుకు కేటగిరీ వారీగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ షార్ట్‌లిస్ట్ ప్రకటించింది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (జాబితా-1), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO) (జాబితా-2) ఇతర పోస్ట్‌లు (జాబితా-3) వేర్వేరు కటాఫ్‌లు నిర్ణయించినట్లు ఫలితాల్లో పేర్కొన్నారు. టైర్-1 పరీక్షను 11,000 మంది అభ్యర్థులు క్లియర్ చేశారు. టైర్-II, III పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల పేరు, రోల్ నంబర్ మెరిట్ జాబితాలో పేర్కొన్నారు. ఈ ఫలితాల్లో SSC CGL టైర్-1 పరీక్ష కేటగిరీ వారీగా కట్ఆఫ్‌ను కూడా వెల్లిండించారు.
SSC CGL టైర్-1, 2020 ఫలితాలను ఇలా తెలుసుకోండి :
- ssc.nic.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి
- హోమ్‌పేజీలో రిజల్ట్స్ విభాగానికి వెళ్లి 'CGL'ని ఎంచుకోండి
- వెబ్‌పేజీలో SSC CGL టైర్-1, 2020 ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయండి
- SSC CGL టైర్-1, 2020 ఫలితాల పీడీఎఫ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
- SSC CGL టైర్-1, 2020 డౌన్ లోడ్ చేసుకోండి
- CGL టైర్-1 పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టైర్-II కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైర్-III డిస్క్రిప్టివ్ పరీక్ష చివరగా టైర్-IV కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Also Read: వాట్ ఈజ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ పాలసీ.. త్వరలో నిపుణుల కమిటీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి