ఒక్కోసారి స్కాలర్ షిప్స్ అనేవి.. విద్యార్థి జీవితాన్నే మార్చేస్తాయి. మంచి స్కాలర్ షిప్ లు .. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఎంతో ఉపయోగం. పేద విద్యార్థులకు సైతం.. వీటితో ఆర్థికంగా ఆసరగా ఉంటుంది. భవిష్యత్ కు బాటలు వేస్తోంది. అలాంటి కొన్ని స్కాలర్ షిప్ లు అప్లై చేసుకోండి. 


కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ విద్యార్థులకు చదువుల కోసం స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ పేరుతో అందించే స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వివిధ పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలలోని విద్యార్థులకు వర్తిస్తుంది.


2021 బోర్డు పరీక్షలలో కనీసం 75% మార్కులతో 10వ తరగతి లేదా 12వ తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్, 4 సంవత్సరాల ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వార్షిక ఆదాయం.. ఏడాదికి 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. ఎంపికైన స్కాలర్స్ వారి ప్రస్తుత విద్యా స్థాయిని బట్టి 3 సంవత్సరాలపాటు రూ.30,000 చొప్పున స్కాలర్‌షిప్‌ను పొందవచ్చు.


దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2021


ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి..


నికాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021-22


నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఫోటోగ్రఫీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


అర్హతలు
దీనికి అర్హతలు ఏంటంటే.. 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఫోటోగ్రఫీ కోర్సులు అభ్యసించే విద్యార్థులు అర్హులు.
ఎంపికైన వారు సంవత్సరానికి లక్ష రూపాయల వరకు స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం ఉంది.


దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2021
ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి..



కొవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2021


కొవిడ్ క్రైసిస్ (జ్యోతి ప్రకాశ్) సపోర్ట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లో స్కాలర్ షిప్ పొందవచ్చు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. 


అర్హతలు..
1వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న భారతీయ విద్యార్థులు దీనికి అర్హులు. జనవరి 2020 నుంచి తల్లిదండ్రులు లేదా సంపాదిస్తున్న కుటుంబ సభ్యుడిని కోల్పోవడ, ఇంట్లోని సంపాదించే వ్యక్తి ఉద్యోగం కోల్పోవడం జరిగి ఉంటే ఈ స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు సంవత్సరానికి గరిష్టంగా 30,000 రూపాయలు, మెంటర్‌షిప్ ప్రయోజనాలు ఉంటాయి.


దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-11-2021
ఈ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి


Also Read: AP Aided Institutions: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు