హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. వివేకానంద నగర్‌లోని ఓ పెద్ద ఇంట్లో ఈ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ పార్టీలో మొత్తం 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, హుక్కా పీల్చే పరికరాలను, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో యువతులు లేకపోవడం చూస్తే.. వీరంతా హోమో సెక్సువల్స్ అని పోలీసులు వెల్లడించారు. ఈ యువకులంతా కలిసి ప్రతి వారాంతంలో ఇలా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


రంగురంగుల, మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాల్లో శనివారం రాత్రి వేళ యువకులు పార్టీ చేసుకుంటుండగా పోలీసుల దాడులు చేశారు. వీరంతా వివేకానంద నగర్‌లోని ఇంటిలో ఫూటుగా మద్యం సేవించి, హుక్కా పీలుస్తూ, డాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రతి వీకెండ్‌లో ఇలా యువకులంతా కలిసి పార్టీలు నిర్వహించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఈ రేవ్ పార్టీ గురించి తెలిసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు దాడులు చేశారు. 


ఈ రేవ్ పార్టీ నిర్వహకులు ఇమ్రాన్, దయాల్‌ అనే వ్యక్తులుగా పోలీసులు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. వీరు ఒక వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి స్వలింగ సంపర్కులను అందులో చేర్చి పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా తేల్చారు. గత రెండేళ్ల నుంచి ప్రతి శనివారం యువకులు ఇలా పార్టీలు చేసుకుంటున్నారని, ఒక్కొక్క వ్యక్తి నుంచి రూ.300 తీసుకుంటున్నారని వివరించారు. ఆ ఇంటిని రూ.30 వేలకు అద్దెకు తీసుకుని నిర్వహకులు ఈ రేవ్ పార్టీ చేస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో పట్టుబడ్డ స్వలింగ సంపర్కులను పోలీసులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Also Read:  కామారెడ్డిలో విషాదం.. గుండెపోటుతో డాక్టర్‌, ఆపై ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్‌ మృతి..


Also Read: Kondapur: సెప్టిక్ ట్యాంకులోకి దిగిన కూలీలు.. లోపలే ఇద్దరు దుర్మరణం, కారణం ఏంటంటే..


Also Read: Adilabad: హాస్టల్‌లో భూతం! ఒంటిపై రక్కుతూ, వింత అరుపులు.. అసలేం జరిగిందంటే..


Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి