మీరు బయటకు వెళ్లేందుకు ఆటోలు ఉపయోగిస్తారా? ఓలా, ఉబెర్‌ వంటి యాప్స్‌లో ఆటో, కార్లను బుక్‌ చేస్తుంటారా? అయితే జనవరి నుంచి మీరు ఎక్కువ చెల్లించక తప్పదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈకామర్స్‌ వేదికల ద్వారా బుక్‌ చేసుకొనే ఆటో ప్రయాణాలపై వస్తు సేవల పన్ను (GST) విధించనుంది. 2022, జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.


ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఆటోలను బుక్‌ చేసుకుంటే ఎలాంటి పన్ను లేదు. అదనపు భారం పడేది కాదు. జనవరి నుంచి ఇలాంటి ప్రయాణాలపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న మినహాయింపును ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవన్యూ శాఖ రద్దు చేసింది. ఒక శుభవార్త ఏంటంటే ఆఫ్‌లైన్‌ లేదా బయట ఉండే ఆటో సేవలను వాడుకుంటే మాత్రం ఎలాంటి పన్ను భారం ఉండదు. నేరుగా ఆటోలను పిలిచి ఉపయోగించుకుంటే జీఎస్‌టీ వర్తించదు.


చాలా మంది తమ గమ్య స్థానాలు, కార్యాలయాలకు చేరుకొనేందుకు ఉబెర్‌, ఓలా, ర్యాపిడో వంటి ఆన్‌లైన్‌ వేదికలను ఉపయోగించుకుంటున్నారు. అనుకూలంగా ఉండటం, సమయానికి అందుబాటులో దొరకడం, వేచిచూడాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే బుక్‌ చేసుకొనే సౌకర్యం ఉండటంతో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వీటిపై జీఎస్‌టీ విధించడం ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కొందరు అంటున్నారు. బహుళజాతి సంస్థలకు వ్యతిరేక సూచనలు పంపినట్టు అవుతుందని పేర్కొంటున్నారు. ఒకే సేవను వాడుకుంటున్నప్పుడు ఆన్‌లైన్‌లో పన్ను పడటం, ఆఫ్‌లైన్‌లో లేకపోవడం వివక్ష కిందకు వస్తుందన్న సంకేతాలు ఇస్తుందని అంటున్నారు!


Also Read: LPG cylinder Price: ఇలా చేస్తే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు..!


Also Read: UAN-Aadhar Linking: నవంబర్‌ 30 లోపు యూఏఎన్‌, ఆధార్‌ లింక్‌ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు


Also Read: SBI Credit Card ALERT : మరో 3 రోజులే..! డిసెంబర్‌ 1 నుంచే ఎస్‌బీఐ అదనపు ఛార్జీలు


Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు.. సోమవారం మార్కెట్లో పరిస్థితి ఏంటో?


Also Read: Renault Kwid: లీటరుకు 32.5 కిలోమీటర్ల మైలేజీ.. ర్యాలీలో రెనో క్విడ్ సూపర్ రికార్డు!


Also Read: Koo App: 'కూ'కు అంతర్జాతీయ గుర్తింపు.. నైజీరియాలో సత్తా చాటిన భారత యాప్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి