ఊహించినట్టే జరిగింది..! మహిళల బాటమ్‌వేర్‌ కంపెనీ 'గో కలర్స్‌' ఐపీవో సూపర్‌ డూపర్‌ హిట్టైంది. తొలిరోజు ఈ కంపెనీ షేర్లు 81.5 శాతం ఎక్కువ ధరకు ముగిశాయి. మంగళవారం సాంతం మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనైనా ఈ కంపెనీ షేరుకు తిరుగులేకుండా పోయింది. ఐపీవో అలాట్‌మెంట్‌ దక్కని మదుపర్లు కొనుగోళ్లు చేసేందుకు ఎగబడ్డారు.


గో కలర్స్‌ రూ.1014 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. రూ.655-రూ.690 ధరతో షేర్లను కేటాయించారు. మంగళవారం 10 గంటలకు ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.1316 వద్ద ఆరంభం అయ్యాయి. అంటే ఇష్యూ ధర రూ.690తో పోలిస్తే 90 శాతం ప్రీమియంతో నమోదన్నమాట. బీఎస్‌ఈలో ఇంట్రాడేలో రూ.1341 వద్ద గరిష్ఠాన్ని తాకి రూ.1144 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి రూ.1252 వద్ద ముగిసింది.


ఎన్‌ఎస్‌ఈలో గో కలర్స్‌ ఇంట్రాడే గరిష్ఠమైన రూ.1339ని తాకింది. ఒకానొక సమయంలో రూ.1143 వద్ద కనిష్ఠాన్ని అందుకొని చివరికి 81శాతం ఎక్కువగా రూ.1253 వద్ద ముగిసింది. ఈ కంపెనీ ఒక లాట్‌కు 21 షేర్లను కేటాయించింది.


బీఎస్‌ఈ లెక్కల ప్రకారం.. గో కలర్స్‌ ఒక లాట్‌కు తొలిరోజు భారీ లాభాలను పంచిపెట్టింది. సాధారణంగా ఒక లాట్‌కు పెట్టుబడి మొత్తం రూ.14,490. ఇంట్రాడే గరిష్ఠమైన రూ.1341 వద్ద విక్రయిస్తే రూ.28,161 చేతికి అందేవి. కనిష్ఠమైన రూ.1144 అమ్మిఉంటే రూ.24,024 వచ్చేవి. ఇక ముగింపు ధర రూ.1252 వద్ద అమ్మేస్తే రూ.26,292 చేతికి అందేవి.


గో కలర్స్‌ బ్రాండ్‌కు మార్కెట్లు మంచి పేరుంది! విమెన్‌ బాటమ్‌వేర్‌లో వివిధ రకాల అప్పారెల్స్‌ను విక్రయిస్తోంది. రిటైల్‌, ఈ-టైల్‌, ఆన్‌లైన్‌లో దుస్తులను విక్రయిస్తోంది.  తమ మార్కెట్‌ వాటాను పెంచుకొనేందుకు టెక్నాలజీ, ఇతర విభాగాలపై పెట్టుబడులు పెడుతోంది. తొలిసారి లాక్‌డౌన్‌ పెట్టడంతో కాస్త నష్టాలను నమోదు చేసిన కంపెనీ వెంటనే పుంజుకొని లాభాలు అందుకుంది.


Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత


Also Read: Post Office Scheme: రూ.100తో మొదలుపెట్టే ఈ స్కీమ్‌తో రూ.16 లక్షలు పొందొచ్చు!


Also Read: DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?


Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి