క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో మంగళవారం కొనుగోళ్లు ఫర్వాలేదు! ఎక్కువ మార్కెట్‌ విలువ కలిగిన కాయిన్స్‌పై ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్‌ ధర 1.88 శాతం పెరిగి రూ.45,04,961గా ఉంది. మార్కెట్‌ విలువ రూ.81,53,531 కోట్లకు చేరుకుంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరెమ్‌ ఏకంగా 7.57 శాతం పెరిగి రూ.3,59,895 వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.39,28,899 వద్ద ఉంది.


బైనాన్స్‌ కాయిన్‌ 2.54 శాతం పెరిగి రూ.48,845, టెథెర్‌ 0.13 శాతం పెరిగి రూ.77.66, సొలానా 2.47 శాతం పెరిగి రూ.16,276, కర్డానో 2.28 శాతం పెరిగి రూ.125, రిపుల్‌ 3.61 శాతం పెరిగి రూ.78.44 వద్ద కొనసాగుతున్నాయి. ఇక 6 శాతానికి పైగా నష్టపోయి ఎయిర్‌స్వాప్‌ రూ.34, స్టేటస్‌ రూ.7.81, పవర్‌ లెడ్జర్‌ రూ.48, స్టార్జ్‌ రూ.217, బ్యాండ్‌ ప్రొటో రూ.607 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 


హెచ్చుతగ్గులు ఉంటాయి


క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?


క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి


భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత


Also Read: Post Office Scheme: రూ.100తో మొదలుపెట్టే ఈ స్కీమ్‌తో రూ.16 లక్షలు పొందొచ్చు!


Also Read: DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?


Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి