కమల్ హాసన్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. కరోనా బారిన పడిన ఆయన గత నెల 22న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. అమెరికా వెళ్లి వచ్చిన కమల్, పరీక్షలు చేయించుకోగా కొవిడ్ అని తేలింది. దాంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆయనలో స్వల్ప లక్షణాలు ఉండటంతో త్వరగా కోలుకున్నారు.
కమల్ హాసన్ పూర్తిగా కోలుకున్నారని ఆయనకు చికిత్స అందించిన శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ తెలియజేసింది. బుధవారం మధ్యాహ్నం కమల్ హెల్త్ అప్‌డేట్ విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీ వరకూ ఆయన్ను ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్టు పేర్కొంది. ఈ నెల 4 నుంచి ఆయన వృత్తిపరమైన పనులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. తనకు కరోనా వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు కమల్ సూచించారు.
కమల్ హాసన్‌కు కరోనా రావడం, ఆయన ఐసోలేషన్‌లో ఉండటంతో 'బిగ్ బాస్'కు హోస్ట్ చేయడానికి కుదరలేదు. ఆయన బదులు లాస్ట్ వీక్ ఎపిసోడ్‌కు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ చేశారు. రమ్యకృష్ణ హోస్ట్ చేయడానికి ముందు కమల్ కుమార్తె శ్రుతీ హాసన్ పేరు వినిపించింది. కానీ, ఆమె రాలేదు. రమ్యకృష్ణ వచ్చారు. నెక్స్ట్ వీక్ కమల్ హోస్ట్ చేయడానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్టే. సినిమాలకు వస్తే... 'ఖైదీ', 'మాస్టర్' ఫేమ్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఆయన 'విక్రమ్' సినిమా చేస్తున్నారు.
Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
Also Read: ‘రాధేశ్యామ్’ సాంగ్.. ‘నన్ను ప్రేమిస్తే చస్తావ్’ ఇదో రొమాంటిక్ వార్నింగ్!
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: భీమ్లా నాయక్ పాట విడుదల చేయడం లేదు... ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి