పేదలకు మేలు చేయడానికే వన్ టైమ్ సెటిల్ మెంట్, సంపూర్ణ గృహ హక్కు పథకం తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇళ్ళపై సంపూర్ణ హక్కులు కల్పిస్తే బ్యాంకుల్లో రుణం పొందడానికిగానీ, అవసరమైతే అమ్ముకోవడానికిగానీ, చట్టపరమైన ఆస్తిగా తమ పిల్లలకు రాసి ఇచ్చుకునేందుకుగానీ వీలు ఉంటుందని మంత్రి తెలిపారు. ఆ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెచ్చారని తెలిపారు. ఈ పథకంపై చంద్రబాబు, టీడీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Also Read : ఏపీలో "ఓటీఎస్" దుమారం ! అసలేంటి ఈ పథకం ? ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు ?
ఓటిఎస్ పథకం స్వచ్చందమని ఎవరిపైనా ఒత్తిడి చేయబోమన్నారు. ఇది బలవంతపు పథకం కాదని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లకు, వార్డు వాలంటీర్లు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నారని.. ఎవరు ముందుకు వస్తే వారికే అమలు చేస్తామన్నారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లలో ఎలాంటి రుసుంలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. సంతబొమ్మాళిలో ఓ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సర్క్యూలర్‌తో ప్రభుత్వానికి సంబంధం లేదని బొత్స స్పష్టం చేశారు. టీడీపీ దానిపై వెంటనే విమర్శలు ప్రారంభించడంతోనే కుట్ర ఉందని తేలిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : రెండున్నరేళ్ల టర్మ్ పూర్తి ! ఏపీలో కొత్త కేబినెట్ ముహుర్తం ఎప్పుడు ?
వన్‌టైమ్ సెటిల్‌మెంట్ శాశ్వతమైన గృహ హక్కును కల్పిస్తున్న పథకమని బలవంతం కాదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్లను ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని అధికారంలో ఉన్న అయిదేళ్లు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఓటీఎస్ స్కీమ్ పెట్టాలని అధికారులు కోరితే తిరస్కరించారన్నారు. ఏ ఒక్క వర్గానికీ ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని.. బొత్స స్పషఅటం చేశారు. ప్రతిపక్షం విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు.
Also Read : హోదా ముగిసిన అధ్యాయం.. పార్లమెంట్ సాక్షిగా మరోసారి తేల్చేసిన కేంద్రం !
ఓటీఎస్ పథకంలో భాగంగా 1983 నుంచి ఇళ్ల రుణాలను తీసుకున్న వారు రూ. పది, రూ. ఇరవై వేలను కడితే ఇళ్లను వారిపై రిజిస్టర్ చేస్తున్నారు. అయితే ఉచితమని చెప్పి ఇచ్చిన ఇళ్లకు ఇలా డబ్బు కట్టించుకోవడం ఏమిటని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ విమర్శలు రావడంతో బొత్స స్పందించారు.
Also Read : ఏపీకి వరద సాయం రూ.895 కోట్లిచ్చాం .. విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి ఆన్సర్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి