ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్‌ను ఇచ్చే వరకూ అడుగుతూ ఉంటామని సీఎం జగన్ ప్రకటించారు. అది ముగిసిన అధ్యాయం కాదని పార్లమెంట్‌లో ప్రశ్నిస్తామని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలూ కూడా చెబుతూ ఉంటారు. అయితే పార్లమెంట్ సమావేశాల రెండో రోజే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 


Also Read : ఎన్టీఆర్ వర్సిటీ నిధుల మళ్లింపు... ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు.. అప్పులు దొరక్క నిధులు మళ్లిస్తున్నారని ఆగ్రహం


14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది. అందువల్ల 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించాం. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్రమే చెల్లిస్తుందని అని నిత్యానందరాయ్‌ తెలిపారు. 


Also Read : విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.686 కోట్లు విద్యాదీవెన నిధులు...10 రోజుల్లోగా కాలేజీలకు కట్టాలని సీఎం జగన్ సూచన !


ఇక  విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో కేంద్రం సమీక్ష నిర్వహిస్తోదన్నారు. ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని మంత్రి తెలిపారు. వివాదం ఉన్న విషయాల్లో  రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 


Also Read : పయ్యావులపై అనంతపురం అధికారులు ఫైర్.. కారణం ఏంటో తెలుసా?


ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో గత రెండున్నరేళ్లుగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ అంశంపై కేంద్ర తాను చెప్పాలనుకున్నది చెబుతోంది. అయితే కేంద్రం ఏమి చెప్పినా తాము మాత్రం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూ ఉంటామని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు.


Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !


Also Read : దయచేసి నెల్లూరు వైపు రావొద్దు.. వచ్చి ఇబ్బందులు పడొద్దు.. అధికారుల సూచనలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి