ఒమిక్రాన్ వేరియంట్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్.. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమావేశమయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ కట్టడిపై పలు సూచనలు చేశారు.
కేంద్రం సూచనలు..
- కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం చేయాలి.
- కరోనా నిర్ధరణ అయితే ఆ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపించాలి.
- ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, హోం ఐసోలేషన్ వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- కరోనా టెస్టింగ్, వ్యాక్సినేషన్ కార్యక్రమం, మౌలిక వైద్యవసతులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి.
నిబంధనలు కఠినతరం..
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త వేరియంట్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠిన నిబంధనలు విధించింది కేంద్రం. ఆయా దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయాలన్న అంశంపై ప్రస్తుతం సమీక్ష జరుపుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బీ.1.1.529 వేరియంట్‌ను ఇప్పటికే ఆందోళనకర రకంగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ.
వ్యాప్తిని అధికం చేసే మ్యూటేషన్లతో పాటు రోగనిరోధకతను తప్పించుకునే మ్యూటేషన్లు రెండూ ఒమిక్రాన్ వేరియంట్‌లో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కనుక ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది.
ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. సౌతాఫ్రికాతో పాటు పశ్చిమ పసిఫిక్, ఐరోపా, తూర్పు మెడిటెరెనియన్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అంతర్జాతీయ ప్రయాణికుల వల్ల ఈ వేరియంట్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
Also Read: 12 MP Suspension: ఎంపీల సస్పెన్షన్‌పై వెనక్కి తగ్గని వెంకయ్య.. విపక్షాలు వాకౌట్
Also Read: Omicron Variant: 'ఒమ్రికాన్'పై కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
Also Read: New Chief Of Indian Navy: భారత నౌకాదళ కొత్త అధిపతిగా హరి కుమార్.. ఆయన ప్రత్యేకతే వేరు!
Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాందోళన వేళ ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు
Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
Also read: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
Also read: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...
Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి