భారత్‌లో ఇప్పటివరకు ఒక్క ఒమ్రికాన్‌ వేరియంట్ కేసు కూడా బయటపడలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తర సమయంలో ఈ మేరకు బదులిచ్చారు.


సౌతాఫ్రికా నుంచి ముంబయి వచ్చిన 19 మందికి కొవిడ్ పాజిటివ్ రావడంతో ఒమ్రికాన్ వేరియంట్ భయాలు పెరిగాయి. ఇప్పటికే ఈ వేరియంట్ భారత్‌లో అడుగుపెట్టిందని వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి భరోసా ఇచ్చారు. 


సౌతాఫ్రికా నుంచి వచ్చి వారిలో 100 మందికి ఇప్పటికే కరోనా పరీక్షలు చేయగా ఒమ్రికాన్ వేరియంట్ ఉందా అనేది స్పష్టం కాలేదు. ఆ విమానంలో ముంబయి వచ్చిన 466 మంది పాసింజర్లను ట్రాక్ చేసేందుకు ముంబయి నగర కార్పొరేషన్ ప్రయత్నిస్తోంది. వీరితో పాటు ఈ 14 రోజుల్లో ముంబయి వచ్చిన 1000 మందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.


డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..


ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పెనుముప్పుగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.  వ్యాప్తిని అధికం చేసే మ్యూటేషన్లతో పాటు రోగనిరోధకతను తప్పించుకునే మ్యూటేషన్లు రెండూ ఒమిక్రాన్ వేరియంట్‌లో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కనుక ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది.


" ఒమిక్రాన్ వల్ల కొవిడ్ 19 కేసులు పెరిగితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఒమ్రికాన్ వేరియంట్ సోకి చనిపోయినట్లు ఎక్కడా మా దృష్టికి రాలేదు.                                     "


            -   డబ్ల్యూహెచ్ఓ


ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. సౌతాఫ్రికాతో పాటు పశ్చిమ పసిఫిక్, ఐరోపా, తూర్పు మెడిటెరెనియన్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వేరియంట్‌ను  గుర్తించారు. అంతర్జాతీయ ప్రయాణికుల వల్ల ఈ వేరియంట్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.


డబ్ల్యూహెచ్ఓ సూచనలు..



  • నిరంతర పర్యవేక్షణ, వైరస్ కట్టడి చర్యలతో పాటు ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తిపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలకు అవగాహన ఉండాలి.

  • ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు ఎస్‌జీటీఎఫ్ కలిగిన పీసీఆర్ టెస్ట్ చేయాలి. దీని వల్ల ఒమిక్రాన్‌ను గుర్తించడం సులభం. 

  • ఒమిక్రాన్ కేసులను, వ్యాప్తి చెందుతోన్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు డబ్ల్యూహెచ్ఓకు తెలియజేయాలి. శాంపిళ్లలో ఎంతమేరకు ఒమిక్రాన్ వేరియంట్ నిష్పత్తి ఉందో తెలపాలి. 

  • కొవిడ్ 19 వ్యాక్సినేషన్ జోరుగా సాగాలి. పెంచాలి. 

  • అంతర్జాతీయ విమాన ప్రయాణికులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. 


Also Read: New Chief Of Indian Navy: భారత నౌకాదళ కొత్త అధిపతిగా హరి కుమార్.. ఆయన ప్రత్యేకతే వేరు!


Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాందోళన వేళ ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు


Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు


Also read: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?


Also read: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...


Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి