దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన నెలకొంది. అయితే రోజువారి కరోనా కేసులు మాత్రం తక్కువగానే నమోదయ్యాయి. కొత్తగా 6,990 కరోనా కేసులు నమోదుకాగా 190 మంది వైరస్‌ వల్ల మృతి చెందారు. 10,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 







  • మొత్తం కేసులు: 3,45,70,274

  • ‬మొత్తం మరణాలు: 4,68,980

  • యాక్టివ్​ కేసులు: 1,00,543

  • మొత్తం కోలుకున్నవారు: 3,40,18,299


యాక్టివ్ కేసుల సంఖ్య 546 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,543గా ఉంది. మృతుల సంఖ్య 4,68,980కి పెరిగింది.


గత 53 రోజులుగా కరోనా కేసుల సంఖ్య 20 వేల కంటే తక్కువగానే ఉంది. గత 155 రోజులుగా ఈ సంఖ్య 50 వేల కంటే తక్కువే ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.29గా ఉంది. కొవిడ్ రికవరీ రేటు 98.35గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.







వ్యాక్సినేషన్​..







సోమవారం ఒక్కరోజే 78,80,545 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ 1,23,25,02,767కు చేరింది.


కేరళ.. 


కేరళలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 3,382 కరోనా కేసులు నమోదుకాగా 117 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 51,25,262కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 39,955కు చేరింది.


గత 24 గంటల్లో 44,638 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 666 కేసులు నమోదయ్యాయి. తిరువనంతపురం (527), కోజికోడ్ (477) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 


Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు


Also read: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?


Also read: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...


Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి