విటమిన్ డి... మన శరీరానికి అత్యవసరమైన విటమిన్. ఆహరంలోని పోషకాలను, కాల్షియాన్ని శరీరం శోషించుకోవాలంటే ఇది చాలా అవసరం. విటమిన్ డి  లోపం వల్ల నరాల సమస్యలు, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొన్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం పెరుగుతుంది. విటమిన్ డి పుష్కలంగా లభించాలంటే సూర్య రశ్మి శరీరానికి తగిలేలా చేసుకోవాలి. వేసవిలో అందరికీ సూర్య రశ్మి బాగానే తగులుతుంది. కానీ శీతాకాలంలో సూర్యుడు ఒకంతట ఉదయించడు. ఉదయించినా కూడా చల్లగాలికి భయపడి ఎవరూ బయటికి రారు. దీని వల్ల విటమిన్ డి లోపం తలెత్తుతుంది. అందుకే రోజులో కాసేపు కచ్చితంగా ఎండ తగిలేటట్టు చూసుకోవాలి. ఆయుర్వేద వైద్యులు చలికాలంలో ఏ సమయంలో, ఎంతసేపు సూర్య రశ్మి శరీరానికి తగిలితే  మంచిదో సూచిస్తున్నారు. 


ఈ సమయం మంచిది
విటమిన్ డి పుష్కలంగా శరీరానికి అందాలంటే ఏ సమయంలో ఎండలో కూర్చోవాలో చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. సాయంత్రం సూర్యుడు అస్తమించడానికి ముందు పసుపు వర్ణంలో ఎండ కాస్తుంది. ఆ ఎండలో రోజుకు 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు కూర్చుంటే శరీరానికి అవసరమయ్యే విటమిన్ అందుతుంది. 


ఎంతో అవసరం
శీతాకాలంలో చాలా మంది త్వరగా రోగాల బారిన పడుతుంటారు. జలుబు, దగ్గు, జ్వరం... ఇలా. ఆ కాలంలో మన రోగనిరోధక శక్తి మందగిస్తుంది. అందుకే త్వరగా వ్యాధులు దాడి చేస్తాయి. విటమిన్ డి పుష్కలంగా అందితే రోగనిరోధక వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు సూర్యకాంతిలో ఉండే UVA (అల్ట్రావైలెట్ ఏ) రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. 


మానసిక ఆరోగ్యం కోసం...
సూర్యకాంతిలో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్, డోపమైన్ మీ మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆందోళన, డిప్రెషన్ వంటి వాటి బారిన పడకుండా కాపాడతాయి.  అంతేకాదు సూర్యకాంతి మీకు చక్కటి నిద్రను ప్రసాదిస్తుంది. స్లీపింగ్ హార్మోనును పెంచుతుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: నిద్రలోనే ప్రాణాలు తీసే మహమ్మారి ఇది... లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దు


Read Also: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి


Read Also: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి