భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఆద్యంత ఒడుదొడుకులకు లోనయ్యాయి! నవంబర్‌ నెల జీఎస్‌టీ గణాంకాల్లో వృద్ధి సూచనలతో ఆరంభంలో మార్కెట్లు ఒక్కసారిగా ఎగిశాయి. వాహన విక్రయాల తగ్గుదల, ఒమిక్రాన్ వేరియెంట్‌పై మోడెర్నా సీఈవో అభిప్రాయం, విదేశీ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరణ కొనసాగించడంతో విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొని చివరికి నష్టాల్లోనే ముగిశాయి.


క్రితం రోజు 57,260 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఉదయం 57,272 వద్ద మొదలైంది. ఒక్కసారిగా ఇంట్రాడే గరిష్ఠమైన 58,183కు చేరుకుంది. ఆపై విక్రయాల ఒత్తిడి కొనసాగడంతో ఇంట్రాడే కనిష్ఠం 56,867కు చేరుకుంది.  అక్కడి నుంచి పడుతూ లేస్తూ చివరికి 195 పాయింట్ల నష్టంతో 57,064 వద్ద ముగిసింది. గరిష్ఠ స్థాయితో పోలిస్తే సెన్సెక్స్‌ 1300 పాయింట్లు పతనమైనట్టు లెక్క! ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఉదయం 17,051 వద్ద మొదలైంది. వెంటనే ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 17,324ను తాకి చివరకు 70 పాయింట్ల నష్టంతో 16,983 వద్ద ముగిసింది.


నిఫ్టీలో పవర్‌గ్రిడ్‌, శ్రీసిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటాన్‌, టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లాభపడ్డాయి. టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ ఎయిర్‌పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో నష్టాల్లో ముగిశాయి.


మార్కెట్లు మరింత పడిపోవడం బేరిష్‌ సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తోందని నిపుణులు అంటున్నారు. నిఫ్టీ 17,000 కింద ముగియడం బుల్స్‌ను ఆందోళనలోకి నెట్టేస్తోందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి బుల్లిష్‌ సెంటిమెంటుకు మానసికంగా బ్రేక్‌ఔట్‌ లాంటిదని పేర్కొన్నారు. నిఫ్టీకి సరైన మద్దతు లభించకపోతే 16,500 స్థాయిలకు సూచీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.






Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత


Also Read: Post Office Scheme: రూ.100తో మొదలుపెట్టే ఈ స్కీమ్‌తో రూ.16 లక్షలు పొందొచ్చు!


Also Read: DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: GST for Auto Ride Booking: కొత్త షాక్‌..! ఆటో బుక్‌ చేసుకుంటే జీఎస్‌టీ మోత.. ఎప్పట్నుంచంటే?


Also Read: Paytm Q2 Result: మరింత పెరిగిన పేటీఎం నష్టాలు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి