వీఆర్వోలు రాజకీయాలు చేస్తున్నారా ... అని రాష్ట్ర మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని కడప జిల్లా ప్రొద్దుటూరు వీఆర్వోలు డిమాండ్ చేశారు. శుక్రవారం వీఆర్వోలు విధులు బహిష్కరించి ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కమిషనర్ ఓటీఎస్ పై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వీఆర్వోలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గెటవుట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వీఆర్వోలు ఈ విషయాన్ని సమావేశానికి వస్తున్న మంత్రి అప్పలరాజు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆయన వీఆర్వోలు రాజకీయాలు చేస్తున్నారా అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు బాధాకరమన్నారని వీఆర్వోలు ఆరోపించారు. 



Also Read:  " అన్నమయ్య డ్యాం ప్రమాదంపై అంతర్జాతీయంగా అధ్యయనం జరిగితే పరువు పోతుంది.." రాజ్యసభలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు


మంత్రిని బర్తరఫ్ చేయాలి


ఈ సమావేశంలో మంత్రి అప్పలరాజు సచివాలయాలకు వీఆర్వోలు వస్తే సర్పంచులు, ఎంపీటీసీలు తరిమి కొట్టాలంటూ మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి రెవెన్యూ  సిబ్బందిపై రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం దురదృష్టకరమని వీఆర్వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని బర్తరఫ్ చేయాలని,  మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గురువారం సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటనలో ఉన్నప్పుడు వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. 


Also Read: వాళ్లకి కూడా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలివ్వాలి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !


మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు
              
శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలుపై సమీక్ష సమావేశంలో మంత్రి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీఆర్వోలను సచివాలయాల్లో రాకుండా చూడాలని, వస్తే తరిమికొట్టాలని అధికారులను ఆదేశిస్తూ కామెంట్స్ చేశారు. అప్పలరాజు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిరసనలు చేస్తూ మంత్రి బర్తరఫ్ కు డిమాండ్ చేశాయి. గురువారం అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. మంత్రి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వీఆర్వోలు డిమాండ్ చేశారు. 


Also Read: వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన... బాధితులకు అండగా ఉంటామని హామీ... తక్షణ సాయం రూ.189 కోట్లు ముంజూరు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి