ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ కాలేజీల్లో  యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను వర్తింపజేయాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న.. ప్రభుత్వ నిబంధనను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీని కన్వీనర్‌ చూస్తారనే నిబంధనను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.  ప్రభుత్వ నిబంధనలు సమంజసంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. 


Also Read : వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన... బాధితులకు అండగా ఉంటామని హామీ... తక్షణ సాయం రూ.189 కోట్లు ముంజూరు


ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో.55ని జారీ చేసింది. దీని ప్రకారం 30 శాతం సీట్లు యాజమాన్య కోటా కింద భర్తీ చేయాలి. అలా భర్తీ చేసే వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందవు. దీనిని సవాల్‌ చేస్తూ రాయలసీమ డిగ్రీ కాలేజీల అసోసియేషన్‌,  మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు కోర్టులో పిటిషన్లు వేశారు. యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్‌ ఆధ్వర్యంలో భర్తీ చేస్తామనడం సరికాదని ప్రైవేటు కాలేజీల యా జమాన్యాల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని కోర్టులో వాదించారు.


Also Read:  ఫేక్ వీడియోతో దుష్ప్రచారం.. ఢిల్లీలో ఏపీ పరువును టీడీపీ ఎంపీలు తీస్తున్నారన్న మార్గాని భరత్


ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతారని మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు తరపు  న్యాయవాది హైకోర్టులో వాదించారు. 30శాతం సీట్లను యాజమాన్య కోటా కింద భర్తీ చేయడానికి వీల్లేదన్నారు. యాజమాన్య కోటా కింద సీటు పొందిన విద్యార్థి మూడొంతులు ఎక్కవ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీరికి ప్రభుత్వ పథకాలు అమలు కావని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  ఉపకార వేతనాలు చెల్లించకుండా తప్పించుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం 30శాతం సీట్లను యాజమాన్య కోటా కింద కేటాయించిందని ఆరోపించారు . 


Also Read: 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం జగన్ - సమాచారం లేదన్న ఉద్యోగ సంఘాలు !


ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ పిటిషన్లకు విచరాణ అర్హత లేదని విద్యార్థులకు యాజమాన్య కోటా సీట్లు ఎంపిక చేసుకొనేందుకు వెసులుబాటు మాత్రమే కల్పిస్తామని, పేద విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని వాదించారు. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాబోయే రోజుల్లో 9-12 తరగతులకు కూడా ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానాన్ని తీసుకొచ్చి...అక్కడా యాజమాన్య కోటా ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల అమలును నిలిపివేస్తారా? అని ప్రభుత్వ న్యాయవాదిని అడిగింది.  విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాలు, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల భారాన్ని తగ్గించుకొనేందుకే డిగ్రీ ప్రవేశాల్లో కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా విధానాన్ని తీసుకొచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.  చివరికి వారికి పథకాలు వర్తింప చేయాలని తీర్పు ఇచ్చింది. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి