చిత్తూరు , కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం పూర్తిగా కొట్టుకుపోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటనపై పార్లమెంట్‌లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా మాట్లాడారు. డ్యాం సేఫ్టీ బిల్లును ప్రవేశ పెట్టిన ఆయన..ఆ బిల్లు ఆవశ్యకత ఎంత ఉందో చెప్పే ప్రయత్నంలో ఇటీవల జరిగిన అన్నమయ్య డ్యాం ప్రమాదాన్ని కూడా ఉదహరించారు. 


Also Read : వాళ్లకి కూడా విద్యాదీవెన, వసతి దీవెన పథకాలివ్వాలి.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !


అన్నమయ్య డ్యాంకు ఒకేసారి దాని స్పిల్‌వే సామర్థ్యానికి ఒకటిన్నర రెట్లు అధికంగా నీళ్లు వచ్చాయని.. అందుకే స్పిల్‌వే విరిగిపోయిందన్నారు. స్పిల్‌వే, గేట్లు తెరిచి నీటిని బయటకు పంపేందుకు అధికారులు ప్రయత్నించారు కానీ ఒక గేటు తెరుచుకోలేదన్నారు. దానికి బాధ్యులు ఎవరు అని గజేంద్ర సింగ్ ప్రశ్నించారు.  రాష్ట్రానికి దాని బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ డ్యాం గురించి అంతర్జాతీయంగా అధ్యయనం మొదలుపెడితే అది మనకు సిగ్గుచేటు అవుతుందన్నారు. డ్యాం తెగిపోవడానికి సభలో కూర్చున్న సభ్యులంతా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. 


Also Read : వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన... బాధితులకు అండగా ఉంటామని హామీ... తక్షణ సాయం రూ.189 కోట్లు ముంజూరు


అన్నమయ్య ప్రాజెక్టుకు నిర్వహణపై ఇప్పటికే రాజకీయ విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఇసుక కోసమే పెద్ద ఎత్తున వరద వస్తుందని తెలిసినా నీటిని సకాలంలో దిగువకు విడుదల చేయలేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని.. ప్రమాదంపై అంతర్జాతీయంగా అధ్యయనం జరిగితే పరువుపోతుందని వ్యాఖ్యానించడం ఏపీలోనూ  చర్చనీయాంశం అవుతోంది. ఈ డ్యాం ప్రమాదంపై విచారణ జరిపించాలని విపక్ష నేత చంద్రబాబునాయుడు అదే పనిగా డిమాండ్ చేస్తున్నారు. అయి.తే అధికారులు పూర్తి స్థాయిలో స్పందించారని అసాధారణ వర్షం పడటం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రభుత్వం ముందస్తుగానే తేల్చి ఎలాంటి విచారణ చేయడానికి సిద్ధపడటం లేదు. 


Also Read:  ఫేక్ వీడియోతో దుష్ప్రచారం.. ఢిల్లీలో ఏపీ పరువును టీడీపీ ఎంపీలు తీస్తున్నారన్న మార్గాని భరత్


మరో వైపు డ్యాం సేఫ్టీ బిల్లులో ఉన్న డ్యాం రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం లో ఆంధ్రప్రదేశ్‌ డ్యాంలను డ్రిప్‌లో చేర్చలేదని విజయసాయిరెడ్డి పేర్కొనడంపైనా గజేంగ్ర సింగ్ షెకావత్ స్పందించారు. అయితే కేంద్రం నిర్ధేశించుకున్న అర్హతలను ఆంధ్రప్రదేశ్‌ చేరుకోలేదని.. చేరుకున్న తర్వాత సూచించిన డ్యాంలను ఇందులో చేరుస్తామని కేంద్రమంత్రి తెలిపారు. 


Also Read: 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం జగన్ - సమాచారం లేదన్న ఉద్యోగ సంఘాలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి