న్యూజిలాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాకు వరుస షాకులు తగిలాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ (0; 4 బంతుల్లో), నయావాల్ చెతేశ్వర్ పుజారా (0; 5 బంతుల్లో) ఓకే ఓవర్లో డకౌట్ అయ్యారు. దాంతో జోరుగా ముందుకు సాగుతున్న ఇన్నింగ్స్ కాస్త మందగించింది. ఆటగాళ్లు ఆచితూచి ఆడాల్సి వస్తోంది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ (52 బ్యాటింగ్; 121 బంతుల్లో 6x4, 2x6), శ్రేయస్ అయ్యర్ (7 బ్యాటింగ్; 21 బంతుల్లో 1x4) నిలకడగా ఆడుతున్నారు.
ఓపెనర్ల జోరు
వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచు ఆలస్యంగా మొదలైంది. వాతావరణం అనుకూలించకపోవడమే ఇందుకు కారణం. లంచ్ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా జోరుగా ఆడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్ (44; 71 బంతుల్లో 7x3, 1x6) వేగంగా ఆడారు. చక్కని షాట్లతో అలరించారు. కట్టుదిట్టమైన బంతుల్ని అడ్డుకుంటూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. దాంతో 25 ఓవర్లకు భారత్ 71/0తో నిలిచింది.
పటేల్ బ్రేక్
జోరుగా ఆడుతున్న టీమ్‌ఇండియాకు స్పిన్నర్ అజాజ్ పటేల్ బ్రేకులు వేశాడు. జట్టు స్కోరు 80 వద్ద మూడు కీలక వికెట్లు తీశాడు. అర్ధశతకానికి చేరువైన శుభ్‌మన్ గిల్‌ను 27.3వ బంతికి పెవిలియన్ పంపించాడు. క్రీజులో ఉండి డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన గిల్.. రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చాడు. మళ్లీ 29 ఓవర్లో బంతి అందుకున్న పటేల్ వరుసగా రెండు వికెట్లు తీశాడు. 29.2వ బంతికి పుజారాను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి విరాట్ కోహ్లీనీ అతడే బలిగొన్నాడు. ప్యాడ్లకు బంతి తగలగానే పటేల్ బిగ్గరగా అప్పీల్ చేశాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ అర్ధశతకం చేయడంతో 37 ఓవర్లకు భారత్ 111/3తో టీకి వెళ్లింది.
Also Read: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?
Also Read: బిగ్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు అశ్విన్ రెడీ..! ఏంటో తెలుసా?
Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!
Also Read: శ్రేయస్‌నూ కరుణ్ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?
Also Read: రెండో టెస్టు నుంచి రహానే, జడేజా, ఇషాంత్ శర్మ ఔట్.. బీసీసీఐ ప్రకటన
Also Read: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్ తాజా కోటీశ్వరులు వీరే