టీమ్‌ఇండియా వన్డే సారథిగా విరాట్‌ కోహ్లీ కొనసాగుతాడా..?   ..లేదా? వారం రోజుల్లో తేలిపోనుంది. భవిష్యత్తు దృష్ట్యా 50 ఓవర్ల ఫార్మాట్‌ను రోహిత్‌ శర్మకే అప్పగిస్తే మంచిదని కొందరు అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఆడేది కొన్ని వన్డేలే కాబట్టి విరాట్‌నే కొనసాగిస్తే బెటరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


ఏదేమైనా విరాట్‌ భవితవ్యం మరో వారం రోజుల్లో తేలడం ఖాయమే! న్యూజిలాండ్‌తో సిరీసు ముగియగానే టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. నిబంధనల ప్రకారం కొన్ని రోజులు క్వారంటైన్లో  ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనుంది. డిసెంబర్‌ 17న తొలి టెస్టు మొదలవుతుంది. జనవరిలో పొట్టి ఫార్మాట్‌ ఉంటుంది.


ఈ పర్యటన కోసం భారత జట్టును వారం రోజుల్లో ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ వెలుగుచూడటంతో అసలు ఈ పర్యటన జరుగుతుందా లేదా అన్న సందేహాలూ ఉన్నాయి. బీసీసీఐ.. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం రాగానే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌  కమిటీ సమావేశం అవుతుంది. జట్టును ఎంపిక చేస్తుంది. అప్పుడే వన్డే కెప్టెన్సీపై చర్చ మొదలవుతుంది.


ఏదేమైనా మరో వారం రోజుల్లో కోహ్లీ భవితవ్యం తేలనుంది. నాయకత్వ బదిలీని సాఫీగా, ప్రశాంతంగా చేయాలని కొందరు అంటున్నారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. అందుకే అన్ని జట్లు ఎక్కువగా పొట్టి క్రికెట్‌పైనే ఏకాగ్రత సారించాయి. వన్డేలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందులోనూ వచ్చే ఏడాది టీమ్‌ఇండియా కేవలం 9 వన్డేలే ఆడుతోంది. అందుకే కోహ్లీనే ఉంచితే బెటర్‌ అని కొందరి అభిప్రాయం. మరికొందరేమో భారత క్రికెట్‌ భవిష్యత్తు దృష్ట్యా రోహిత్‌కే వన్డే పగ్గాలు అందిస్తే మంచిదని అంటున్నారు.


ఏదేమైనా విరాట్‌ కెప్టెన్సీపై తుది నిర్ణయం తీసుకొనేది బీసీసీఐ అధ్యక్ష్య కార్యదర్శులు సౌరవ్‌ గంగూలీ, జే షానే!


Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు 


Also Read: David Warner Tweet: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై.. ఛాప్టర్ క్లోజ్ అంటూ ట్వీట్.. SRH ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు 


Also Read: IPL Highest Paid Players: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్‌ తాజా కోటీశ్వరులు వీరే


Also Read: Neeraj Chopra: మోదీ చెప్పారు.. నీరజ్‌ మొదలు పెట్టాడు..! ఏంటా మిషన్‌..? ఎందుకు..?


Also Read: IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?


Also Read: IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి