న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా తలనొప్పి మొదలైంది! కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి ప్రవేశించాడు. దాంతో తుది జట్టులో ఎవరిని తొలగించాలో జట్టు యాజమాన్యానికి అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రేని అడిగితే జట్టుకున్న వనరులకు ఇదో ఉదాహరణగా వర్ణించాడు.
ఏడు నెలలుగా ఎడతెరపి లేకుండా క్రికెట్ ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కివీస్‌తో టీ20 సిరీసు, తొలి టెస్టుకు దూరంగా ఉన్నాడు. ముంబయిలో జరిగే రెండో టెస్టుకు అతడు జట్టులోకి వచ్చేశాడు. దాంతో ఎవరిని జట్టులోంచి పక్కన పెట్టాలో అర్థం కావడం లేదు. కొత్త కుర్రాడు శ్రేయస్‌ను తీసేద్దామంటే అరంగేట్రంలో టెస్టులో వరుసగా శతకం, అర్ధశతకం చేసి ఆకట్టుకున్నాడు. రహానె, పుజారా ఫామ్‌లో లేరు కానీ.. వారిద్దరూ జట్టుకు కీలకమే. మరి ఏం చేస్తారన్నది ఆసక్తికరం.
'ఈ సమస్య మంచిదే! మా వద్ద ఎంతో మంది నైపుణ్యాలున్న ఆటగాళ్లు ఉన్నారు. ఇది భారత క్రికెట్ స్థితిని తెలియజేస్తోంది. వచ్చిన కుర్రాళ్లకు మేం అవకాశాలు ఇవ్వాలనే అనుకుంటున్నాం. శ్రేయస్ అయ్యర్ వచ్చి వరుసగా శతకం, అర్ధశతకం చేయడం అద్భుతం. కానీ కొన్నిసార్లు మనం సమతూకం, పరిస్థితులు, వికెట్‌ను బట్టి కూర్పు ఉంటుంది' అని పరాస్ మహంబ్రే అంటున్నాడు.
అజింక్య రహానె ఫామ్‌లో లేడు. పుజారాకు మంచి ఆరంభాలే వచ్చినా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. 'వారిద్దరి వెనక ఎంతో అనుభవం ఉందని మనకి తెలుసు. వారిప్పటికే చాలా క్రికెట్ ఆడారు. వారు ఫామ్‌లోకి రావడానికి ఒక ఇన్నింగ్స్ చాలు. ఒక జట్టుగా మేం వారికి అండగా ఉంటాం. జట్టుకు వారు తీసుకొచ్చే విలువ అందరికీ తెలుసు' అని మహంబ్రే వెల్లడించాడు.
Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు
Also Read: SRH Retention 2022: కథ మళ్లీ మొదటికే.. ‘0’ నుంచి షురూ చేయాల్సిందే కేన్ మామా!
Also Read: IPL Retention: ధోనీ లేని చెన్నై..! మహీని తీసుకోవద్దంటూ గంభీర్ సూచన!