టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఓ విచిత్రమైన ప్రిడిక్షన్‌ చేశాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌  ఎవరెవరిని రీటెయిన్‌ చేసుకోవాలో సూచించాడు. ఎంఎస్ ధోనీని అట్టిపెట్టుకోవద్దని అంటున్నాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో అతడు మాట్లాడాడు.


ఐపీఎల్‌ రీటెన్షన్‌కు నవంబర్‌ 30 చివరి తేదీ. ఇప్పటికే దాదాపుగా ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయో ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. అధికారికంగా మాత్రం ఇంకా జాబితాలు బయటకు రాలేదు.


ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుందో చాలామంది మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ సైతం చెన్నై సూపర్‌కింగ్స్‌కు సంబంధించి తన అభిప్రాయ వ్యక్తం చేశాడు. ఎంఎస్‌ ధోనీని రీటెయిన్‌ చేసుకోవద్దని సూచించాడు. యువ క్రికెటర్‌ రుతురాజ్ గైక్వాడ్‌, సీనియర్‌ ఆటగాడు రవీంద్ర జడేజాను తీసుకోవాలని అంటున్నాడు. విదేశీయుల కోటాలో డుప్లెసిస్‌, సామ్ కరన్‌ను తీసుకోవాలని చెబుతున్నాడు.


మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్‌ నలుగురు ఆటగాళ్లను తీసుకున్నట్టు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అంచనా వేసింది. ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీని ఆ జట్టు తీసుకుందని తెలిపింది. పదేళ్ల వరకు ఫ్రాంచైజీకి సేవలు అందించగలవారినే ఎంచుకుంటామని ధోనీ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నిర్ణయాన్ని బట్టి ప్రధాన జట్టును నిర్మించుకుంటామని వెల్లడించాడు. ఇక అధికారిక జాబితా మంగళవారం రాత్రి విడుదల కానుంది.


Also Read: Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్‌


Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!


Also Read: Ahmedabad Franchise: అహ్మదాబాద్.. ఇలా అయితే ఎలా.. ఐపీఎల్ 2022లో కష్టమే!


Also Read: CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?


Also Read: WTC Points Table 2021-2023: టెస్టు చాంపియన్‌షిప్ రేసు మొదలైంది... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా.. టాప్ ఎవరంటే?


Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. SRH ఒక్కరికే ఛాన్స్ ఇచ్చిందా..!


Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత


Also Read: Post Office Scheme: రూ.100తో మొదలుపెట్టే ఈ స్కీమ్‌తో రూ.16 లక్షలు పొందొచ్చు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి