New Chief Of Indian Navy: భారత నౌకాదళ కొత్త అధిపతిగా హరి కుమార్.. ఆయన ప్రత్యేకతే వేరు!

ABP Desam Updated at: 30 Nov 2021 02:26 PM (IST)
Edited By: Murali Krishna

నౌకాదళానికి కొత్త అధిపతిగా ఆర్ హరి కుమార్ బాధ్యతలు చేపట్టారు. జాతీయ ప్రయోజనాలే తన లక్ష్యమని పేర్కొన్నారు.

భారత నౌకాదళాధిపతిగా హరి కుమార్

NEXT PREV

భారత నూతన నౌకాదళాధిపతిగా అడ్మిరల్ ఆర్ హరి కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్.. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా ఉన్నారు. నౌకాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన హరి కుమార్‌కు నావికాదళం గౌరవ వందనం చేసింది.








నావికాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ ప్రయోజనాలు, సవాళ్లపైనే భారత నౌకాదళం దృష్టి సారించింది.                                     - ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి 

 

నావికాదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించే ముందు తన మాతృమూర్తికి పాదాభివందనం చేశారు హరి కుమార్.



 

1968 ఏప్రిల్ 12న పుట్టిన హరి కుమార్.. 1983 జనవరి 1న ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. 39 ఏళ్ల తన సర్వీసులో నేవిగేషన్, డైరెక్షన్లో మంచి నైపుణ్యం ఉన్న అధికారిగా పేరొందారు. ఐఎన్‌ఎస్ నిషాంక్, మిస్సైల్ కోర్‌వెట్టే, ఐఎన్‌ఎస్ కోరా, ఐఎన్‌ఎస్ రణవీర్, ఐఎన్ఎస్ విరాట్ సహా పలు యుద్ధనౌకలను ఆయన కమాండ్ చేశారు. 






యూఎస్ నావల్ వార్ కాలేజ్, ఎమ్‌హౌ ఆర్మీ వార్ కాలేజ్, యూకే రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్‌లలో కీలక కోర్సులు చేశారు. హరి కుమార్‌కు పరమ విశిష్ట సేవా మెడల్ (పీవీఎస్‌ఎమ్), ది అతి విశిష్ట సేవా మెడల్ (ఏవీఎస్ఎమ్), విశిష్ట సేవా మెడల్ (వీఎస్ఎమ్) ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది. భారత నౌకదళానికి హరి కుమార్ 22వ చీఫ్ కాగా తొలి ఇద్దరు చీఫ్‌లు బ్రిటీష్ జాతీయులు. 


Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాందోళన వేళ ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు


Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు


Also read: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?


Also read: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...


Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 30 Nov 2021 02:26 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.