ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మిషన్‌కు భారత 'బల్లెం వీరుడు' నీరజ్ చోప్రా సిద్ధమయ్యాడు. డిసెంబర్ 4న అహ్మదాబాద్‌లోని సంస్కార్‌ధామ్ పాఠశాలను సందర్శించనున్నాడు. సంతులిత ఆహారం, ఫిట్‌నెస్, క్రీడల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించనున్నాడు. వారితో కలిసి జావెలిన్ విసరనున్నాడు. కలిసి ఆడనున్నాడు.
టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగివచ్చిన అథ్లెట్లకు ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 16న తన స్వగృహంలో ఆతిథ్యం ఇచ్చారు. అల్పాహార విందు ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆయన అందరు క్రీడాకారులను కలిసి మాట్లాడారు. గెలుపోటములతో సంబంధం లేకుండా అందరితోనూ కలుపుగోలుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విందు సమయంలోనే తన మిషన్ గురించి ప్రధాని మోదీ క్రీడాకారులతో పంచుకున్నారు. 2023లో స్వాత్రంత్ర్య దినోత్సవానికి ప్రతి ఒలింపియన్, పారాలింపియన్ దేశంలోని 75 పాఠశాలలను సందర్శించాలని కోరారు. పౌష్టికాహార లోపం గురించి విద్యార్థులకు వివరించాలని సూచించారు. సంతులిత ఆహారం, శారీరక దారుఢ్యం, క్రీడల గురించి వారితో తమ అనుభవాలు పంచుకోవాలని తెలిపారు. విద్యార్థులతో కలిసి ఆడాలని సూచించారు.
ఈ మిషన్‌లో భాగంగానే నీరజ్ చోప్రా డిసెంబర్ 4న తొలి పాఠశాలను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. పీఎం మోదీ మిషన్‌ను నీరజ్ మొదట ఆరంభిస్తున్నారని వెల్లడించారు. 'పాఠశాలలకు వెళ్లాలని, విద్యార్థులను కలవాలని, వారికి సంతులిత ఆహారం, ఫిట్‌నెస్, క్రీడలు ఇతర అంశాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. డిసెంబర్ 4న అహ్మదాబాద్‌లోని సంస్కార్ పాఠశాలను సందర్శించనున్నాడు' అని మంత్రి ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా ఈ మిషన్ చేపట్టారు.
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. వందేళ్లకు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో తొలి పతకం అందించాడు. అందులోనూ స్వర్ణ పతకం కావడంతో దేశమంతా మురిసింది.
Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు
Also Read: SRH Retention 2022: కథ మళ్లీ మొదటికే.. ‘0’ నుంచి షురూ చేయాల్సిందే కేన్ మామా!
Also Read: IPL Retention: ధోనీ లేని చెన్నై..! మహీని తీసుకోవద్దంటూ గంభీర్ సూచన!