సైబర్ నేరస్థులు రాన్రానూ మోసాల విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఏ మ్రాతం అలసత్వంగా ఏమరుపాటుగా ఉన్నా రూ.లక్షలు పోగొట్టుకోక తప్పదు. ఇలా ఎంతో మంది బాధితులు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో పాలుపోక చివరికి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో ఐటీ ఉద్యోగి ఏకంగా రూ.29 లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాలివీ..


హైటెక్‌ సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిలువునా మోసపోయాడు. యువతి నగ్న వీడియో కాల్‌కు యువకుడు టెంప్ట్ అవ్వడంతో ఏకంగా రూ.29 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఫేస్‌బుక్‌లో అమ్మాయి ప్రొఫైల్‌ ఫొటో, పేరుతో అపరిచిత వ్యక్తి నుంచి ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. వెంటనే అతను యాక్సెప్ట్‌ చేసేశాడు. కాసేపటికి న్యూడ్‌ వీడియో కాల్‌ అంటూ మెసెంజర్‌లో మెసేజ్‌ పంపించింది.


దీంతో సరేనని ఎగిరి గంతేసిన ఇతను అందుకు రెడీ అయ్యాడు. కాల్‌ లిఫ్ట్‌ చేయగానే ఓ అమ్మాయి నగ్న వీడియో ప్లే అయింది. అయితే  వాస్తవానికి అది లైవ్ వీడియో కాదు.. రికార్డెడ్‌ వీడియో. అటువైపు నుంచి ఆడ గొంతుతో ఈ టెకీని కూడా బట్టలు విప్పమని కోరింది. దీంతో ఇతను కూడా తన ఒంటిపై బట్టలు విప్పేశాడు. ఆ తర్వాత జరిగిన సన్నివేశం మొత్తాన్ని అటువైపు నుంచి సైబర్‌ నేరస్తులు వీడియో రికార్డు చేస్తూనే ఉన్నారు. మొత్తానికి న్యూడ్ వీడియో కాల్ పూర్తయింది.


Also Read : అనంతపురంలో యువతి హత్య.. గర్భిణీగా తేల్చిన పోలీసులు, విచారణలో సంచలన విషయాలు


ఢిల్లీ ఏసీపీ పేరుతో కాల్..
ఇకడ్నుంచి నేరస్థుల అసలు కథ మొదలైంది. వీడియో కాల్‌ పూర్తయ్యాక.. కాసేపటికి బాధితుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ ఏసీపీని మాట్లాడుతున్నానని.. మీతో న్యూడ్‌ వీడియో కాల్‌ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని బెదిరించాడు. ఢిల్లీలో కేసు నమోదయిందని.. అరెస్ట్‌ చేస్తామని బెదిరించేసరికి.. ఇతను భయపడిపోయాడు. అమ్మాయి సెల్‌ఫోన్‌ వీడియోలను సంబంధించిన రికార్డ్‌ అంతా రికవరీ చేశామని తెలిపారు. ఆ వీడియో ఇతనికే పంపడంతో నిజమేనని నమ్మేశాడు.


కేసుల్లాంటి తలనొప్పులు లేకుండా ఈజీగా బయటపడాలంటే కొంత డబ్బు పంపిచాలని కోరాడు. కొంత మంది అధికారులను మేనేజ్ చేయాల్సి ఉందని నమ్మబటికాడు. గత నెల 7వ తేదీ నుంచి 20 రోజుల పాటూ విడతల వారీగా రూ.29 లక్షలు ఆన్‌లైన్‌లో సమర్పించుకున్నాడు. అయినా వదిలిపెట్టకుండా పదే పదే బెదిరిస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో గురువారం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదంతా రాజస్తాన్‌ చెందిన సైబర్‌ ముఠా పనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


Also Read : బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!


అయితే, ఇలాంటి ఘటనలపై సైబరాబాద్ పోలీసులు స్పందించారు. ఇప్పటివరకు నగ్న వీడియో కాల్స్‌ ఘటనలపై 6, 7 కేసులు నమోదయ్యాయని.. ఈ తరహా మోసాలను సెక్ట్సార్షన్‌ అని పిలుస్తారని తెలిపారు. ఈ తరహా బాధితులు చాలా మందే ఉంటారు కానీ, చెప్పుకోవటానికి సిగ్గుపడి ముందుకు రావటం లేదని వెల్లడించారు. పోలీసులు ఏమంటారోనని భయపడుతుంటారని.. సైబర్‌ నేరస్తులకు ఇదే ఆయుధంగా మారుతోందని అన్నారు.


Also Read : వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి