నందమూరి బాలకృష్ణ నటించిన Akhanda సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అఘోరాగా బాలయ్య విధ్వంసం సృష్టించాడని ప్రేక్షకులు అంటున్నారు. భూకంపానికి సునామీ తోడైనట్లుగా.. బాలయ్య ఉగ్రరూపానికి తమన్ సంగీతం తోడైంది. ఆ బీజీఎం వింటుంటే పూనకాలు వస్తున్నాయని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉందని అంటున్నారు. చివరికి Thaman ఇచ్చిన సంగీతాన్ని తట్టుకోవడం మావల్ల కాదంటూ సినిమా హాళ్లు నోటీసులు కూడా పెట్టుకోవల్సి వచ్చిందంటే.. బీజీఎం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 


ట్విట్టర్‌లో సినీమార్క్ (Cinemark) థియేటర్ పెట్టిన ఓ నోటీస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘మా మూవీస్‌లో సౌండ్‌ను నిర్దిష్ట డెసిబిల్ కిందే ప్లే చేస్తాం. మా స్పీకర్లు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఇది కనీస ప్రమాణం. కాబట్టి మీరు వినే ఆడియో తగిన ప్రమాణాల ప్రకారం పెట్టాం. దాన్ని ఎట్టిపరిస్థితుల్లో పెంచబోము. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొంది. ఈ ఫొటోను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది అమెరికాలోని ఓ మల్టిఫ్లెక్స్ సంస్థ పెట్టిన నోటీస్ అని సమాచారం. సినిమా ఎలా ఉందనే ప్రశ్నకు.. చాలామంది.. తమన్ కుమ్మేశాడు అనే సమాధానం ఇస్తున్నారు. తమన్ బీజీఎం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని అంటున్నారు. తమన్ మ్యూజిక్ లేకపోతే ‘అఖండ’ లేదని పలువురు అంటున్నారు. బాలయ్య, బోయపాటి, తమన్ కలిస్తే.. ఎలా ఉంటుందో చూపించారంటూ ట్వీట్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.






తమన్ తపన ఫలించిన వేళ..: తమన్ ‘అఖండ’పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాలయ్యతో సినిమా అనగానే ఎంతో శ్రమించానని చెప్పుకోచ్చాడు. పైగా అఘోరా పాత్రలో ఉండే బాలయ్యకు ఇచ్చే మ్యూజిక్ గుర్తుండిపోయేలా చేయాలనే తపన.. ఈ మ్యూజిక్ వింటే తెలుస్తుంది. ఇటీవల ఆయన ‘అఖండ’ ప్రీరిలీజ్‌లో మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫైర్ ఉందని, ఎమోషన్ బాగుందని తెలిపాడు. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయని తమన్ అన్నాడు. ‘అఖండ’ సినిమాకు సంగీతం అందించేందుకు అఘోరల మీద రీసెర్చ్ చేశానని పేర్కొన్నాడు. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చానని తెలిపాడు. టైటిల్ సాంగ్ కంపోజ్ కోసం దాదాపు నెల రోజులు శ్రమించినట్లు తమన్ తెలిపాడు.


















Also Read: ‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అఘోరా ఎంట్రీ చూస్తే పూనకాలేనట!


Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు షాక్.. ఆగిన షూటింగ్, సర్జరీ కోసం అమెరికాకు ప్రయాణం?


Also Read:  'పావుగంటకొక పెక్.. రాత్రికొక పెగ్'.. బ్రహ్మానందంతో బాలయ్య అల్లరి..


Also Read: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి