రివ్యూ: మరక్కార్: లయన్ ఆఫ్ ద అరేబియన్ సీ (అరేబియా సముద్ర సింహం)
రేటింగ్: 2/5
ప్రధాన తారాగణం: మోహన్ లాల్, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంజూ వారియర్, కీర్తీ సురేష్, సిద్ధిఖీ, అశోక్ సెల్వన్, హరీష్ పేరడి తదితరులతో పాటు ప్రత్యేక పాత్రల్లో ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణీ ప్రియదర్శన్, సుహాసిని
ఎడిటర్: ఎం.ఎస్. అయ్యప్పన్ నాయర్
కెమెరా: తిరు
స్వరాలు: రోనీ రాఫెల్
నేపథ్య సంగీతం: రాహుల్ రాజ్, అంకిత్ సూరి, ల్యేల్ ఇవాన్స్ 
నిర్మాత: ఆంటోని పెరంబువూర్
రచన - దర్శకత్వం: ప్రియదర్శన్
విడుదల తేదీ: 03-12-2021 (తెలుగులో)


ఉత్తమ సినిమాగా విడుదలకు ముందే 'మరక్కార్' జాతీయ అవార్డు అందుకుంది. సినిమాతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ విభాగంలోనూ జాతీయ అవార్డులు వచ్చాయి. విడుదల కాని సినిమాకు అవార్డులు ఎలా ఇస్తారు? అంటే... సెన్సార్ పూర్తయిన తేదీని అవార్డులకు పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల, అవార్డులు లభించాయి. తెలుగులో పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? 


కథ: కుంజాలీ మరక్కార్ (మోహన్ లాల్) ఓ రాబిన్ హుడ్. అతను రాబిన్ హుడ్ కావడం వెనుక ఓ కారణం ఉంటుంది. అతని పూర్వీకులు పోర్చుగీసు వలస వాణిజ్య విధానానికి, భారతీయులపై పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడినవారు. ఓ యుద్ధంలో కుంజాలీ తండ్రి మరణించడంతో అతని బాబాయ్, తాతయ్యలు సైన్యం నుంచి వచ్చేసి వ్యాపారం మొదలుపెడతారు. వీళ్ల వ్యాపారం వృద్ధి చెందడం పోర్చుగీసు వాళ్లు కుట్ర పన్ని కుటంబ సభ్యులు అందర్నీ చంపేస్తారు. కుంజాలీ, అతడి బాబాయ్ బతుకుతారు. రాజు అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరడం లేదని... దొంగల దగ్గర కొల్లగొట్టి ప్రజలకు పంచుతాడు. అతడు అంటే ప్రజలకు మంచి అభిప్రాయం ఉంటుంది. సామంత రాజులు అందరూ అతడిని శిక్షించాలని రాజు మీద ఒత్తడి తీసుకొస్తారు. అదే సమయంలో యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన పోర్చుగీసు సైన్యాన్ని ఎదుర్కోవాలంటే కుంజాలీ అవసరం అని రాజుకు మంగాటచ్చన్ (హరీష్ పేరడి), అతని పెద్ద కుమారుడు అనంత (అర్జున్) సలహా ఇస్తారు. సరేనని అంగీకరించడంతో పాటు కుంజాలీని నావికా దళాధిపతిగా రాజు నియమిస్తారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మళ్లీ గొడవలు ఎందుకు వచ్చాయి? అనంత (అర్జున్)ను కుంజాలీ ఎందుకు చంపుతాడు? దీనికి కారణం అయిన ఆర్చ (కీర్తీ సురేష్) ఎవరు? కథలో ఆమె పాత్ర ఏమిటి? గొడవలను అదునుగా చేసుకుని మళ్లీ రాజ్యంలో అడుగుపెట్టిన పోర్చుగీసు వాళ్లు ఏం చేశారు? ఏమిటి? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ: మన దేశంలో పలు ప్రాంతాల్లో తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు ఉన్నారు. తెలుగు గడ్డకు వస్తే... సైరా నరసింహారెడ్డి ఒకరు. అదే విధంగా అప్పటి మలయాళ గడ్డ మీద కుంజాలీ మరక్కార్ ఒకరు. తెలుగు ప్రజల్లో ఆయన చరిత్ర తెలిసిన వాళ్లు తక్కువ. అందువల్ల, ఆయన మనకు తెలియని యోధుడు. సో... కొత్తగా ఏముందని సినిమాకు వెళితే... తెలిసిన సినిమాలా ఉంటుంది. కుంజాలీ బాల్యం - యవ్వనం నేపథ్యంలో వచ్చే సన్నివేషాలు కొత్తగా ఉంటాయి. ఆ కథ, కథతో పాటు మలయాళ కల్చర్ కనిపించేలా సాగిన ప్రొడక్షన్ డిజైన్, ఆర్టిస్టుల గెటప్స్ మనకు కొత్త కనుక. ఎంత సేపు కల్చర్ చూస్తాం? కథ కూడా ఉండాలి కదా! అసలు కథకు వచ్చేసరికి... కొంత మనకు తెలిసినట్టు ఉంటుంది. మరికొంత మరీ నిదానంగా ముందుకు వెళుతున్నట్టు ఉంటుంది. కుంజాలీ రాబిన్ హుడ్ అయ్యే ఎపిసోడ్, ఆ సీన్స్ 'సైరా'లోనూ చూసినట్టు ఉంటాయి. ఇక... యుద్ధ సన్నివేశాలు బావున్నప్పటికీ...  'బాహుబలి' చూసిన కళ్లకు కొత్తగా ఏమీ తోచవు. అందుకు ప్రధాన కారణం అసలు కథలో ఉపకథలు ఎక్కువ కావడం, నిడివి. 
మూడు గంటల సినిమాలో కుంజాలీ కథపై దర్శకుడు ప్రియదర్శన్ ఎక్కువ దృష్టి పెట్టి ఉండే బావుండేది. అలా చేయకుండా మధ్యలో వచ్చివెళ్లే ఇతర కథలపై ఫోకస్ చేశారు. కీర్తీ సురేష్ పాత్ర అలా వచ్చినదే. పాత్ర పరంగా ఆమె అద్భుతంగా నటించినప్పటికీ... ఆమె దుస్తులు బావున్నప్పటికీ... కుంజాలీ కథలో అది ఉపకథే. దాని వల్ల నిడివి పెరిగింది తప్ప సినిమాకు ప్రయోజనం చేకూరలేదు. అవార్డు సినిమాలు అంటే ఆర్ట్ ఫిలిమ్స్ అని, నిదానంగా వెళతాయనే ఫీలింగ్ కొంతమంది ప్రేక్షకుల్లో ఉంది. అందుకు తగ్గట్టు 'మరక్కార్' సాగింది. మోహన్ లాల్, అర్జున్, సునీల్ శెట్టి, అశోక్ సెల్వన్, మంజూ వారియర్ తదితరులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. మోహన్ లాల్ బదులు ప్రణవ్ మోహ‌న్ లాల్‌ను యంగ్ ఎపిసోడ్స్‌లో చూపించ‌డం బావుంది. మోహన్ లాల్ అభిమానులకు, మలయాళ ప్రేక్షకులకు అది కిక్ ఇచ్చే అంశమే. అయితే... దర్శకుడు ప్రియదర్శన్ స్లో నేరేషన్ థియేటర్లో ప్రేక్షకులకు విసుగు వచ్చేలా చేసింది. అందులోనూ కథలో మలుపులు ఊహించడం ప్రేక్షకులకు పెద్ద కష్టమేమీ కాదు. యుద్ధ నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులకు ఆయా సినిమాల్లో దృశ్యాలు గుర్తుకు వస్తాయి. సినిమాలో ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్, కెమెరా వర్క్ బావున్నాయి. కాస్ట్యూమ్స్ కు అవార్డు తీసుకోవడం సబబుగా అనిపిస్తుంది. ముందుగా చెప్పుకొన్నట్టు కొన్ని యాక్షన్ సీన్స్ డిజైన్ బావుంది. సముద్రంలో యుద్ధం, పతాక సన్నివేశాల్లో వచ్చే యుద్ధం ఆకట్టుకుంటాయి.

Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో న‌యన‌తార‌...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి