మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి సెట్స్‌కు వచ్చారు. షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. దాంతో డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర నెర్వస్‌కు లోనయ్యారు. అదే సమయంలో ఉత్సాహంగానూ ఉన్నారు. ఎందుకంటే... ఆయన చిరంజీవి అభిమాని కాబట్టి.
"ఈ రోజు చాలా థ్రిల్లింగ్ డే అని చెప్పాలి. నెర్వస్‌గా ఉంది. అదే సమయంలో ఉత్సాహంగానూ ఉంది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిగారు మాతో ఫస్ట్ డే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రయాణానికి ఇది గొప్ప ప్రారంభం. మీ అందరి ఆశీస్సులు కావాలి" అని కె.ఎస్. రవీంద్ర (బాబీ) ట్వీట్ చేశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. చిరంజీవి 154వ చిత్రమిది. అందుకని, 'మెగా 154' వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు.
Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం
కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకుడు కాకముందు... స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో... చిరంజీవి సినిమాలు విడుదల అయినప్పుడు కటౌట్లు కట్టారు. చిరంజీవి వచ్చినప్పుడు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాతో పూనకాలు లోడ్ అవుతాయని అన్నారు. 'పూనకాలు లోడింగ్' ఈ సినిమా క్యాప్షన్.
Also Read: రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన దర్శకుడితో విక్రమ్... దళిత్ సినిమా కన్ఫర్మ్
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో డబ్బింగ్ థియేటర్‌లో నయనతార...
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: 'నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే'.. రాధే శ్యామ్ నుంచి మరో సాంగ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి