సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రిలేషన్షిప్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరు కూడా దాగుడుమూతలు వంటివి ఆడటం లేదు. నయనతారతో తీసుకున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. లేటెస్టుగా డబ్బింగ్ థియేటర్‌లో నయనతారతో తీసుకున్న ఫోటోలను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు.
విజయ్ సేతుపతి హీరోగా... నయనతార, సమంత హీరోయిన్లుగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కాతువాకుళే రెండు కాదల్'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నయనతార తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నారు. గతంలో కొన్ని తమిళ్ సినిమాలకు ఆమె డబ్బింగ్ చెప్పారు. తెలుగులో కూడా ఒకట్రెండు సినిమాలకు డబ్బింగ్ చెప్పుకొన్నారు. అయితే... ఆమెతో డబ్బింగ్ చెప్పించిన తొలి దర్శకుడు విఘ్నేష్ శివన్. విజయ్ సేతుపతి, నయనతారతో గతంలో ఆయన 'నానుమ్ రౌడీ దాన్' సినిమా తీశారు. తెలుగులో 'నేనూ రౌడీనే' పేరుతో ఆ సినిమా విడుదలైంది. తమిళంలో నయన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
Also Read: ముస్లిం అమ్మాయిగా సమంత... ఖతీజాగా ఆమెను చూశారా?
'కాతువాకుళే రెండు కాదల్'లో హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్స్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఓటీటీలో సినిమాను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే... దర్శక నిర్మాతలు వాటిపై స్పందించలేదు.
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: 'నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే'.. రాధే శ్యామ్ నుంచి మరో సాంగ్
Also Read: అందరూ ఆమె నీలికళ్లే చూశారు...ఆ కళ్లలో కన్నీళ్లు చూడలేదు..
Also Read: ‘మనీ హైస్ట్’ ట్రైలర్: ముగింపు మామూలుగా ఉండదట.. ప్రొఫెసర్ ఏం చేస్తారో!
Also Read: ఆస్ట్రేలియాలో ఆగిన ‘అఖండ’ షో.. పోలీసులు ఎంట్రీ, చివరికి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి