ఓ భర్త తన స్నేహితుల సాయంతో కట్టుకున్న భార్యనే బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పైగా వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత చిన్న చిన్న కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పుట్టింటికి వెళ్లిన భార్యను తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి కిడ్నాప్ చేశాడు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలివీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ యువకుడు యువతిని ప్రేమించాడు. పెళ్లి కోసం రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలోనే వివాహం చేసుకున్నారు. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన దామల్ల సుధాకర్ - రజిని దంపతులు వృత్తి రీత్యా చాలా కాలం నుంచి హనుమకొండలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు శాంతి హైదరాబాద్‌లో బీఎస్సీ నర్సింగ్ చదువుతూ ఉంది. కరోనా సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన ఆమెకు భూపాలపల్లి జిల్లా స్తంభం పల్లికి చెందిన బాలరాజు అనే వ్యక్తితో పరిచయం అయింది. క్రమంగా ఆ ప్రేమ నుంచి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇలా పెద్దల అంగీకారంతోనే గత ఏప్రిల్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
Also Read : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?
కొన్ని నెలలకే ఈ నవ దంపతుల కాపురంలో గొడవలు అవ్వడం మొదలయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన శాంతి హన్మకొండలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిన శాంతి చాలా రోజులైనా కాపురానికి రాకపోవడంతో పలుసార్లు బాలరాజు భార్యపై ఒత్తిడి తీసుకుని వచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అన్నడంతో బాలరాజు కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా భార్యను కాపురానికి తీసుకొని వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
Also Read: Etala Akarsh : ఉద్యమకారులపై ఈటల ఆకర్ష్ .. బీజేపీలో వరుస చేరికలకు ప్లాన్ !
ఈ క్రమంలోనే ఇటీవల ఖమ్మం జిల్లా ముత్తుగూడెం గ్రామంలోని శాంతి అమ్మమ్మ ఇంట్లో ఓ వేడుకకు హాజరయ్యేందుకు సుధాకర్ కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న బాలరాజు తన స్నేహితులతో శాంతిని బలవంతంగా ఖమ్మం నుంచి తీసుకొని వెళ్లాడు. ఈ ఘటనపై ఖమ్మం జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. కొన్ని రోజుల తర్వాత మెట్టినింటి నుంచి తప్పించుకున్న శాంతి మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై బాలరాజు తన అత్తామామలను ప్రశ్నించగా.. నర్సింగ్ పరీక్షలు పూర్తయిన తర్వాత పెద్దలతో మాట్లాడి పంపిస్తామని తల్లిదండ్రులు బాలరాజుకు నచ్చజెప్పారు.
అయినా వినని అతను, బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న శాంతిని అడ్డగించాడు. స్నేహితులతో కలిసి రెండు కార్లలో వచ్చి.. అత్త రజిని, బావ మరిది సృజన్‌ను పక్కకు నెట్టేసి భార్యను కార్‌లో ఎక్కించుకొని వెళ్లిపోయాడు. దీంతో శాంతి తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం వెతుకుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read : వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి