బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. బీజేపీలోకి ఉద్యమకారులను చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురితో చర్చలుజరిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచి.. ఇప్పుటు టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత దక్కని వారితో ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సి.విఠల్బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
Also Read : ఖమ్మం టీఆర్‌ఎస్‌లో క్రాస్ ఓటింగ్ భయం.. గోవా క్యాంపునకు వెళ్లిన మంత్రి
తెలంగాణ ఉద్యోగుల జేఏసీని ముందుండి నడిపించిన నేతలకు ప్రస్తుతం ప్రాధాన్యత లభించడం లేదు. అనేక మందికి అపాయింట్‌మెంట్ కూడా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితులపై నిరాశ చెంది గతంలో టీఎన్జీఓ అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించిన స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. అదే దారిలో విఠల్ కూడా నడుస్తున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ కూడా బీజేపీలో చేరే యోచనలో ఉన్నారు. ఇదే వరుసలో మరో ఇద్దరు జేఏసీ నేతలు కూడా ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘం మాజీ నేత కూడా ఈటల రాజేందర్‌తో బీజేపీలో చేరికపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి నేతలను అధికార పార్టీకి దూరం చేస్తే ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదనే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఈటల భావిస్తున్నారు. ఈటల మొదటి నుంచి ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో ప్రాధాన్యం లేదనే చెబుతున్నారు. ఉద్యమకారులను టీఆర్ఎస్‌కు దూరం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ పూర్తిగా టీఆర్ఎస్‌కు దూరమయ్యేలా చేయగలమని ఈటల అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో బంగారు తెలంగాణ బ్యాచ్ పేరుతో పాపులరైన కొంత మంది హవా ఎక్కువగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన వారిని బంగారు తెలంగాణ బ్యాచ్‌గా పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యమకారులకు కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే వలసల్ని ఆపేందుకు కూడా ఆ పార్టీ నేతలు పెద్దగా ప్రయత్నం చేయడం లేదు.
Also Read: TRS Voters Camps : టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ .. క్యాంపులకు ఓటర్లు ! అసలేం జరుగుతోంది ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి