ఒకప్పుడు వయసు పెరిగిన వారికే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు 30లలో,40లలో ఉన్న యువతకు కూడా గుండె పోటు, కార్టియాక్ అరెస్టు వంటివి దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఇటలీకి చెందిన ఆరోగ్యసంస్థ చేసిన పరిశోధనలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అధికంగా తినేవారిలో గుండె పోటు వచ్చే అవకాశం పెరుగుతుందని ఆ పరిశోధన తెలిపింది. ఈ పరిశోధన వివరాలు యూరోపియన్ హార్ట్ జర్నల్, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ప్రచురించారు. మొదటిసారి మైల్డ్ గా గుండె పోటు వచ్చిన తగ్గిన వారు అల్ట్రాప్రాసెస్ చేసిన ఆహారాన్ని తింటే రెండో సారి వచ్చే గుండెపోటు ప్రాణాంతకంగా ఉంటుందని తేల్చింది ఈ అధ్యయనం.
పదేళ్ల అధ్యయనం...
ఈ పరిశోధన దాదాపు పదేళ్ల పాటూ సాగింది. 1,171 మందిపై దీన్ని నిర్వహించారు. వీరిందరికీ హృదయ సంబంధ వ్యాధులు ఉన్నాయి. వీరు తినే ఆహారంపై దృష్టి పెట్టారు. వారి తినే ఆహారమే వారికి రెండో సారి గుండెపోటు వచ్చే అవకాశాన్ని నిర్ణయించినట్టు గ్రహించారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించినవారు రెండోసారి గుండె పోటు వచ్చే అవాకాశాన్ని చాలా తగ్గించుకున్నారు. కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నవారిలో మాత్రం తీవ్ర పరిస్థితులు ఎదురయ్యాయి.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే....
అతిగా శుద్ధి చేసిన ఆహారాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు. చక్కెర, కూల్ డ్రింకులు, రస్క్‌లు, క్రేకర్లు, సూపర్ మార్కెట్లలో అమ్మే ప్యాకింగ్ ఫుడ్, యోగర్ట్ వంటివన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వర్గంలోకే వస్తాయి. ఇలాంటి ఆహారాన్ని తినే వ్యక్తులకు రెండోసారి గుండెపోటు వచ్చే అవకాశం మూడింట రెండు వంతుల వరకు పెరుగుతుందని చెప్పారు పరిశోధకులు. మరణించే అవకాశం కూడా 40 శాతం పెరుగుతుందని చెప్పారు. గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండడం చాలా అవసరం అని చెబుతున్నారు.
ఆహారం తయారుచేసే విధానాన్ని బట్టే అవి ఆరోగ్యకరమో కాదో నిర్ణయిస్తాం. అందుకే ప్యాకేజ్డ్ ఫుడ్ కు దూరంగా ఉండి, ఇంట్లో వండే ఆహారానికే హృద్రోగులు ప్రాధాన్యతనివ్వడం అవసరం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read also: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Read also: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
Read also: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Read also: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Read also: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి