వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేసులో కీలక నిందితునిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కావాలనే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్‌లో ఆరోపించారు. గంగిరెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది.
ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. వివేకానంద డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుచేత బెయిలు రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోరింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో గంగిరెడ్డి ఒక్క రోజులోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?
వివేకా హత్య కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతోంది. సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని పాటు వైఎస్ వివేకానందరెడ్డి అనుచరుల నుండి తనకు ప్రాణహాని ఉందని కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీ ఫకీరప్పకు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. తనకు సీబీఐ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై అనంతపురం పోలీసులు విచారణ ప్రారంభించారు. అంతకు ముందు భరత్ యాదవ్ అనే వ్యక్తి కూడా వైఎస్ వివేకా కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తూ మీడియా మావేశం పెట్టారు.
Also Read : వాహన రిజిస్ట్రేషన్లనూ వదల్లేదు... నకిలీ బీమా పాలసీలతో ప్రభుత్వ ఆదాయానికి గండి..
దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు నిర్ణయించారు. అందుకు కోర్టు కూడా అంగీకరించింది. దస్తగిరి కన్ఫెషన్ ఆధారంగా ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకుని నాలుగు రోజుల పాటు ప్రశ్నించారు. పూర్తిస్థాయి చార్జీషీట్ ను దాఖలు చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది.
Also Read : స్నేహితులతో కలిసి భార్యను కిడ్నాప్ చేయించిన భర్త.. అర్ధరాత్రి కారులో ఎత్తుకెళ్లి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి