నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజే సత్త చాటిన బాలయ్య చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ వీకెండ్‌లో మరిన్ని కలెక్షన్లు రావచ్చని అంచనా. ఎన్నో రోజుల తర్వాత ఈ చిత్రం విడుదల కావడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. 


శనివారం (డిసెంబరు 2) ‘అఖండ’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇండియాతోపాటు అమెరికా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రధాన నగరాల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఉదయం నుంచే ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఈవెనింగ్ షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. శుక్రవారం కూడా ‘అఖండ’ టికెట్ల ఊచకోత కొనసాగుతోంది. దీంతో తొలి రోజే భారీ స్థాయిలో బాలయ్య సినిమా వసూళ్లను సాధించింది. అయితే, ఏపీలో బెనిఫిట్ షోలు లేకపోవడం, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం, తక్కువ షోలు తదితర కారణాల వల్ల వసూళ్లలో చాలా వ్యత్యాసం కనిపించింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.15.39 కోట్లు వసూళ్లు సాధించగా అమెరికాలో రూ.3.26 కోట్లు వచ్చాయి. ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని కలెక్షన్ల వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇండ్రస్ట్రీ సమాచారం ప్రకారం.. ‘అఖండ’ రూ.53 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలిసింది. 


⦿ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎంతంటే..:
నైజాం: రూ.4.39 కోట్లు
సీడెడ్: రూ.4.02 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ.1.36 కోట్లు
తూర్పు గోదావరి: రూ.1.05 కోట్లు
పశ్చిమ గోదావరి: రూ.96 లక్షలు
గుంటూరు: రూ.1.87 కోట్లు
కృష్ణా: రూ.81 లక్షలు
నెల్లూరు: రూ.93 లక్షలు
మొత్తం: రూ.15.39 కోట్లు (రూ.23 కోట్లు గ్రాస్)
⦿ ఇది కాకుండా అమెరికాలో తొలి రోజు రూ.3.26 కోట్లు వసూలు చేసింది.  




Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌
Also Read: బికినీ షోలో ఇలియానా తర్వాతే ఎవరైనా అనేలా...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి