జవాద్ తుపాను సహాయకచర్యల కోసం భారత నేవీ రంగంలోకి దిగింది. జవాద్ తుపాను కదలికను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నౌకాదళం పెర్కొంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తూర్పు నావల్ కమాండ్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. రాష్ట్రాలకు అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.







సహాయక చర్యల కోసం ఇప్పటిక 13 వరద సహాయక బృందాలు, నాలుగు డైవింగ్ టీమ్‌లను సిద్ధం చేసినట్లు తెలిపింది. మరో 3 ఎఫ్‌ఆర్‌టీ బృందాలు, 2 డైవింగ్ టీమ్‌లను విశాఖపట్నం నుంచి ఒడిశాకు పంపించింది.


నేవీ డైవింగ్‌ బృందాలు, వైద్య సిబ్బంది, అవసరమైన సామగ్రితో నాలుగు నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేక సిబ్బందితో కూడిన వరద సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. నౌకాదళ ప్రత్యేక హెలికాప్టర్‌లు కూడా సిద్ధంగా ఉంచారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు విశాఖపట్నం తీరంలో ఐఎన్‌ఎస్‌ డేగ, చెన్నై దగ్గర్లో ఐఎన్‌ఎస్ రజలీలను సిద్ధం చేశారు. ముంపు ప్రాంత ప్రజల తరలింపు, ఆహార పొట్లాలు ఇచ్చేందుకు కూడా నౌకదళ ఎయిర్‌క్రాప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి.


దూసుకొస్తోన్న తుపాను..


జవాద్ తుపాను ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 100 కిమీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై జవాద్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి. తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.


Also Read: Cyclone Jawad: తరుముకొస్తోన్న జవాద్ తుపాను.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం


Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!


Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌పై షాకింగ్ నిజాలు.. డెల్టా కంటే ఆ విషయంలో మూడు రెట్లు ఎక్కువట!


Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాల వేళ ఊరట.. దేశంలో 10 వేలకు దిగువనే కొత్త కేసులు


Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి