జవాద్ తుపాను తీవ్రతుపానుగా మారనుంది. ఐదో తేదీ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఒడిశాలోని కోస్తా ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రజిల్లాలకు వర్షాల ముప్పు పొంచి ఉంది. 70 నుంచి 90కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా ఇవాళ గంటకు ఈదురుగాలులు వీస్తాయి. తుపాను కారణంగా 95కుపైగా రైళ్లు రద్దయ్యాయి.
తుపాను తీవ్రత తెలుసుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ అప్రమత్తమైంది. వాతావరణ శాఖ అంచనాలతో ప్రభావిత ప్రాంతాల్లో బలగాలను మోహరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ 46 బృందాలు పంపారు. మరికొన్ని బృందాలు ఎక్కడికైనా వెళ్లేందు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉత్తరాంధ్రపై కనిపిస్తోంది. చలిగాలులు, వర్షాలు మొదలయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. ఏవైనా ప్రాంతాలు ముంపునకు గురైతే తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వాతావరణశాఖాధికారి సునంద తెలిపారు. అత్యవసర సేవల కోసం నౌకాదళం, కోస్టుగార్డు సేవలతోపాటు హెలికాప్టర్లు సిద్ధం చేశారు.
తుపానుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ఆయన సూచనల ప్రకారం...శ్రీకాకుళానికి అరుణ్‌కుమార్, విజయనగరానికి కాంతిలాల్ దండేను ప్రత్యేకాధికారులుగా అధికారులు నియమించారు. తుపాను సన్నద్దతపై జిల్లా అధికారులతో వీళ్లిద్దరు చర్చలు జరుపుతున్నారు.
తుపాను కారణంగా ప్రాణ నష్టం అసలు ఉండకూడదని అధికారులకు సీఎం జగన్ గట్టగా చెప్పారు. సహాయచర్యల్లో అసలత్వానికి చోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని... జిల్లాకు పది కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచామని అధికారులు వివరించారు. తుపాను పరిస్థితిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలుసుకున్నారు.
Also Read: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి