హైదరాబాదీ సొగసరి ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ బంగారమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంటున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా సేవలందించేందుకు అతడు కుటుంబంతో సహా హైదరాబాద్‌ను వదిలేసి బెంగళూరుకు మకాం మారుస్తున్నాడని పేర్కొన్నాడు. అతడిలా చేస్తాడని అస్సలు ఊహించలేదని తెలిపాడు. ఎన్‌సీయే చీఫ్‌గా ఎంపిక చేసే ముందు ఏం జరిగిందో వివరించాడు.
'బీసీసీఐ పరిధిలో సేవలందించేందుకు రావాలని లక్ష్మణ్‌ను గతంలోనే కోరాను. దేశానికి సేవ చేసేందుకు అతనెప్పుడూ ముందుంటాడు. అకాడమీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా ఉండటం, టెలివిజన్లో కామెంటరీ చేస్తుండటంతో మొదట్లో కుదర్లేదు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఎన్‌సీఏయే నువ్వే సరైనవాడివని అతడికి చెప్పాను. నా ప్రతిపాదనకు అంగీకరించేందుకు అతడు కాస్త సమయం తీసుకున్నాడు. కానీ చివరికి ఒప్పుకున్నాడు. అతడికి నేను కెప్టెన్సీ చేశాను. కలిసి సుదీర్ఘంగా ఆడాను. అతడో బంగారం' అని గంగూలీ తెలిపాడు.
ఎన్‌సీయే కోసం లక్ష్మణ్ మూడేళ్ల పాటు హైదరాబాద్‌ను వదిలేస్తున్నాడని గంగూలీ షాకింగ్ న్యూస్ చెప్పాడు. వీవీఎస్ తనకు ఆ విషయం చెప్పడంతో ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు. భార్య, పిల్లలతో బెంగళూరుకు మకాం మారుస్తానని తనతో చెప్పాడని వెల్లడించాడు. తన తల్లిదండ్రులను ఒప్పించానని, బెంగళూరులో ఉంటేనే న్యాయం చేయగలనని భావించాడని పేర్కొన్నాడు. ఏదేమైనా దేశం కోసం అతడిలాంటి త్యాగం చేయడం అపూర్వమని ప్రశంసించాడు.
Also Read: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?
Also Read: బిగ్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు అశ్విన్ రెడీ..! ఏంటో తెలుసా?
Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!
Also Read: శ్రేయస్‌నూ కరుణ్ నాయర్‌లా తప్పిస్తారా? సీనియర్ల కోసం త్యాగం తప్పదా?
Also Read: రెండో టెస్టు నుంచి రహానే, జడేజా, ఇషాంత్ శర్మ ఔట్.. బీసీసీఐ ప్రకటన
Also Read: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్ తాజా కోటీశ్వరులు వీరే