Best TWS Earbuds: వావ్ అనిపించే డిజైన్‌తో కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. ఈ ధరలో బెస్ట్!

నథింగ్ ఇయర్ 1 వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌లో బ్లాక్ కలర్ ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది.

Continues below advertisement

నథింగ్ ఇయర్ 1 బ్లాక్ ఎడిషన్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ కంపెనీని వన్‌ప్లస్ సహవ్యవస్థాపకులు కార్ల్ పెయ్ స్థాపించారు. ఇందులో ట్రాన్స్‌పరెంట్ డిజైన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్‌సీ), ట్రాన్స్‌పరెన్సీ మోడ్, టచ్ కంట్రోల్స్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Continues below advertisement

ఇందులో ట్రాన్స్‌పరెంట్ కేస్‌ను అందించారు. నథింగ్ ఇయర్ 1 తరహాలోనే ఇందులో కూడా ట్రాన్స్‌పరెంట్ కేస్‌ను అందించారు. ఆ ఇయర్ బడ్స్‌లో వైట్ పోర్షన్ ఉన్న చోట ఇందులో బ్లాక్ డిజైన్ అందించారు. ఈ సిలికాన్ ఇయర్ బడ్స్‌లో కొత్త మాట్ బ్లాక్ డిజైన్ అందించారు.

నథింగ్ ఇయర్ 1 బ్లాక్ ధర
దీని ధరను రూ.6,999గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇందులో వైట్ కలర్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. బ్లాక్ వేరియంట్ సేల్ డిసెంబర్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. అయితే దీని కొనుగోలుకు కొన్ని దేశాల్లో క్రిప్టోకరెన్సీని కూడా పేమెంట్‌గా స్వీకరిస్తామని కంపెనీ పేర్కొంది. అంటే బిట్ కాయిన్, ఎథిరియం, యూఎస్‌డీ కాయిన్, డోజీ కాయిన్‌ల ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చన్న మాట. అయితే మనదేశంలో మాత్రం వీటిని పేమెంట్‌గా స్వీకరించబోవడం లేదు.

నథింగ్ ఇయర్ 1 బ్లాక్ స్పెసిఫికేషన్లు
నథింగ్ ఇయర్ 1 స్మార్ట్ ఫోన్ కేస్ డిజైన్ ప్రత్యేకంగా ఉండనుంది. ఇందులో ట్రాన్స్‌పరెంట్ కేస్‌ను కంపెనీ అందించింది.  వీటిలో 11.6 మిల్లీమీటర్ల డైనమిక్ డ్రైవర్లు అందించారు. బ్లూటూత్ 5.2 సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. ఎస్‌బీసీ, ఏఏసీ బ్లూటూత్ కోడెక్స్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్‌సీ) ఫీచర్ కూడా ఉంది. ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రీమియం ఇయర్‌బడ్స్‌లో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు.

10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే.. 8 గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నాయి. వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇవి సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ చార్జింగ్ పోర్టు ద్వారా దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. ఒక్కో ఇయర్‌పీస్ 5 గంటల 35 నిమిషాల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుంది. మొత్తంగా 34 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను దీని కేస్ అందించనుంది.

ఇందులో ప్లేబ్యాక్, నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్స్ కోసం టచ్ కంట్రోల్స్ అందించనున్నారు. వాల్యూమ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో ఉన్న ఇన్ ఇయర్ డిటెక్షన్ ద్వారా మ్యూజిక్‌ను ప్లే, పాజ్ చేసుకునే అవకాశం ఉంది. 

టచ్ కంట్రోల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఇంటెన్సిటీ సెట్టింగ్స్‌ను ఇయర్ 1 యాప్ ద్వారా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలకు ఈ యాప్ అందుబాటులో ఉండనుంది. ఈక్వలైజర్ సెట్టింగ్స్, ఫాస్ట్ పెయిరింగ్, ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్, ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఇందులో అందించారు.

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement