రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ గతంలోనే మనదేశంలో లాంచ్ అయింది. అప్పుడు 6 జీబీ ర్యామ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందించారు. ఇప్పుడు 8 జీబీ ర్యామ్ వేరియంట్ కూడా వచ్చేసింది. కేవలం ర్యామ్ తప్ప మిగతా ఫీచర్లలో ఎటువంటి మార్పూ లేదు.


రెడ్ మీ నోట్ 10ఎస్ ధర
ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 10ఎస్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.17,499గా నిర్ణయించారు. అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐల ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.1,000 వరకు తగ్గింపు లభించనుంది.


గతంలో లాంచ్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా నిర్ణయించారు. డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్ రంగుల్లో రెడ్‌మీ నోట్ 10ఎస్ కొనుగోలు చేయవచ్చు. 


రెడ్‌మీ నోట్ 10ఎస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.  మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


డ్యూయల్ స్పీకర్లు, హైరిజల్యూషన్ ఆడియో వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 4జీ, వైఫై, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.82 సెంటీమీటర్లుగానూ, బరువు 178.8 గ్రాములుగానూ ఉంది.


Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి