ABP  WhatsApp

Priyanka Gandhi Update: 'రైతులకు ఇవ్వడానికి డబ్బుల్లేవ్.. మోదీకి మాత్రం రూ.8 వేల కోట్ల ఖరీదైన విమానం'

ABP Desam Updated at: 02 Dec 2021 07:50 PM (IST)
Edited By: Murali Krishna

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.

'రైతులకు ఇవ్వడానికి డబ్బుల్లేవ్.. మోదీకి మాత్రం రూ.8 వేల కోట్ల ఖరీదైన విమానం'

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. భాజపాపై విమర్శల దాడి పెంచారు. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని ఎద్దేవా చేశారు. మోరాదాబాద్‌లో జరిగిన ప్రతిజ్ఞ రాలిలో యూపీ సర్కార్‌పై విమర్శలు కురిపించారు.



చెరుకు రైతుల బకాయిలు చెల్లించడానికి రూ.4 వేల కోట్లు మాత్రమే అవుతుంది. కానీ ప్రభుత్వం అది చెల్లించలేదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం గత ఏడాది కరోనా సమయంలో రూ.8 వేల కోట్లు పెట్టి ఓ ప్రైవేట్ విమానాన్ని కొనుగోలు చేశారు. రూ. 20 వేల కోట్లు పెట్టి పార్లమెంటు సుందరీకరణ పనులు చేపట్టడానికి డబ్బులు ఉన్నాయి.. కానీ మీ బకాయిలు చెల్లించేందుకు మాత్రం లేవు. -                                                      ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


సాగు చట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతులకు ప్రధాని మోదీ కనీసం నివాళులు అర్పించలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు.



700 మంది రైతులు చనిపోతే కనీసం రెండు నిమిషాలు కూడా వారి గురించి మోదీ మాట్లాడలేదు. లఖింపుర్ ఖేరీ ఘటనలో రైతులను వాహనం ఎక్కించి తొక్కి చంపేశారు. దాని గురించి కూడా భాజపా స్పందించలేదు.                                                       - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


రానున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనుంది. ఇప్పటికే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రియాంక గాంధీ పలు వాగ్దానాలు చేశారు.


Also Read: UK Couple: 'రండి బాబు రండి.. రూ.2 కోట్లు విలువ చేసే ఇల్లు రూ.100కే ఇచ్చేస్తాం'


Also Read: Omicron Variant Cases in India: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


Also Read:  Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి


Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్


Also Read:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది


Also Read: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది


Also Read: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?


Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


 

Published at: 02 Dec 2021 07:49 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.