ABP  WhatsApp

UK Couple: 'రండి బాబు రండి.. రూ.2 కోట్లు విలువ చేసే ఇల్లు రూ.100కే ఇచ్చేస్తాం'

ABP Desam Updated at: 02 Dec 2021 05:43 PM (IST)
Edited By: Murali Krishna

ఓ జంట తమ ఇంటిని అమ్మేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. రూ. 2 కోట్లు విలువ చేసే ఇంటిని రూ.100కే ఇచ్చేస్తోంది.

'రండి బాబు రండి.. రూ.2 కోట్లు విలువ చేసే ఇల్లు రూ.100కే ఇచ్చేస్తాం'

NEXT PREV

రూ.2 కోట్లు విలువ చేసే ఇంటిని రూ.100కే ఇచ్చేసింది ఆ జంట. ఏంటి షాక్ అవుతున్నారా? అవును బ్రిటన్‌కు చెందిన ఓ జంట తమ ఇంటిని అమ్మేందుకు సరి కొత్త ఐడియా వేసింది. అదేంటో తెలుసా?


యూకేకు చెందిన ఆడమ్ వైట్స్ తన భార్య లిజ్ రూ.2 కోట్లు విలువ చేసే తమ ఇంటిని అమ్మేందుకు నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్‌లోని దక్షిణ టైనిసైడ్‌లో ఉన్న ఈ రెండు అంతస్థుల ఇంటిలో మూడు బెడ్‌రూమ్‌లు, ఓ గార్డెన్ ఉంది. ఆ ఇంటికి దగ్గరలోనే ఓ పార్కు కూడా ఉంది.


లాటరీ..


అయితే లిజ్ ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. దివ్యాంగులకు కాస్త ఆహ్లాదం కల్పించేందుకు, కౌన్సిలింగ్ సహా గెట్ టుగెథర్ వంటి పార్టీలను ఈ సంస్థ నిర్వహిస్తుంటుంది. లిజ్ భర్త ఆడమ్ ఒకసారి అక్కడి రిజిస్టర్డ్ మేనేజర్‌ను దివ్యాంగులు వీల్‌ఛైర్‌తో సహా ఊగే ఉయ్యాల కావాలని అడిగారు. అయితే దాని విలువ £13,000 (రూ.13 లక్షలు)గా మేనేజర్ తెలిపారు.


ఆ ఉయ్యాల కొని ఛారిటీకి బహుమతిగా ఇవ్వాలని ఆడమ్ ఆకాంక్షించారు. దీని కోసం తమ ఇంటిని లాటరీ పద్దతిలో అమ్ముదామని ఆడమ్ తన భార్యకు చెప్పాడు. ఇందుకు ముందు ఒప్పుకోకపోయినా తర్వాత తన భార్య లిజ్ సరేనంది.


ఇలా చేయడం వల్ల తమ ఇల్లు అమ్ముడవడమే కాకుండా ఛారటీ కోసం నిధులు సమీకరించేందుకు కూడా డబ్బు వస్తుందని ఆ జంట ఆలోచించింది.



మేం 2 లక్షల టికెట్లు అమ్మితే, ఒకరికి ఈ ఇల్లు దక్కే అవకాశం ఉంది. దీంతో పాటు ఆ ఉయ్యాలకు కావాలిసిన డబ్బులు కూడా మాకు దక్కుతాయి. అవి ఛారిటీ సంస్థకు ఉపయోగపడతాయి. వీల్ ఛైర్ ఏక్ససబుల్ స్వింగ్ కొనాలని మేం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ అది చాలా ఖరీదు కావడంతో అవలేదు. కానీ ఈసారి దాన్ని కొని పిల్లలకు బహుమతిగా ఇస్తాం.                                                 - అడమ్ లిజ్, భార్యాభర్తలు


Also Read: Omicron Variant Cases in India: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


Also Read:  Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి


Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్


Also Read:  ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది


Also Read: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది


Also Read: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?


Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 02 Dec 2021 05:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.