కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉందని తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు హెచ్చరించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆమెకు ఒమిక్రాన్ వైరస్ సోకిందన్న అనుమానతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లుగా చెప్పారు. ఫలితాలు వచ్చాక ఒమిక్రానా కాదా అనేది తెలుస్తుంది. ఒమిక్రాన్ నివారణకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు.
Also Read : ఉద్యమకారులపై ఈటల ఆకర్ష్ .. బీజేపీలో వరుస చేరికలకు ప్లాన్ !
ఒమిక్రాన్ ఎప్పుడైనా దేశంలోకి రావొచ్చని శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. డెల్టా కంటే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోంది. మూడ్రోజుల్లోనే 3 దేశాల నుంచి 24 దేశాలకు వ్యాప్తి చెందిందని శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోనివారు.. రెండో డోస్ టీకా తీసుకోవాల్సిన వారు కచ్చితంగా వ్యాక్సినేషన్‌కు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉందని.. వీరంతా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే నంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారని గుర్తుశారు..
Also Read : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?
కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరం అనేది మనం పాటించే కొవిడ్ నిబంధనల మీద ఆధారపడి ఉంటుందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేసింది.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయానికి వచ్చింది. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని ప్రభుత్వం కోరింది.
ఒమిక్రాన్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుదీర్ఘంగా సమీక్షించారు. ముప్పు ఎలా ఉంటుందో తెలియకపోయినా ముందస్తుజాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు. నాలుగు రోజులు గా కేసులు పెరుగుతున్నందున.. తెలంగాణకు బయటి నుంచి వచ్చే వాళ్ళు తప్పని సరిగా నెగటివ్ సర్టిఫికేట్ ఉండాలనే నిబంధన తీసుకు వచ్చారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి