బావ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  కరీంనగర్ పట్టణంలోని  కాపువాడ లో బుధవారం ఈ ఘటన జరిగింది. తన బావ కనకయ్య తనను వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుతున్నట్లుగా వీడియోలో  మృతురాలు ఆరోపించింది. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు.  


Also Read: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?


బాధితురాలు సెల్ఫీ వీడియో


'ఎప్పుడో రూ.10 వేలు తీసుకుంటే మూప్ఫై వేలు ఇచ్చానని బెదిరిస్తున్నాడు. కరోనా టైంలో కూడా మెడలో బంగారం అమ్ముకుని బతికామే తప్ప అప్పు చేయలేదు. నేను నా బిడ్డలు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాము. ముంజం కనకయ్య అనే వ్యక్తి... రూ. 30 వేలు ఇచ్చానని బెదిస్తున్నాడు. ఫోన్ చేయమని లేదా ఒకసారి కలవమని చెప్తున్నాడని... లేకపోతే ఇంటికి వచ్చి గొడవపెడతానంటున్నాడు. ఎవరికి ఏం చెప్పాలో తెలియడంలేదు. నాలో నేను చాలా కుమిలిపోతున్నాను. పిల్లలు జాగ్రత్త.. ఎవరినీ నమ్మొద్దు. ముంజం కనకయ్య టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.' అని మృతురాలు అరుణ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు చేసుకున్నారు. 


Also Read: కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు...


శ్రీకాళహస్తిలో వాలంటీర్ ఆత్మహత్య..


చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్.డి.కే.నగర్ లో 9వ వార్డు వాలంటరీ పనిచేస్తున్న ఉమా మహేశ్వరి(24) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు‌ నమోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ... శ్రీకాళహస్తి పట్టణంలో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, తన కూతుర్ని మానసికంగా వేధించడంతో ఆ బాధలు తాళలేక గత రాత్రి ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి కారణమైన కానిస్టేబుల్ ను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని మృతురాలి తల్లి ఉన్నతాధికారులను వేడుకుంటుంది.


Also Read: వివేకా హత్య కేసులో కీలక మలుపు .. హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి